nalgonda abortion gang: అబార్షన్ల ముఠా గుట్టురట్టు.. నల్గొండ జిల్లాలో 9 మంది అరెస్ట్, ఆస్పత్రుల సీజ్ – illagal abortions gang arrested in nalgonda district

0
30


గ్రామీణ ప్రాంతాల్లో గర్భం దాల్చిన మహిళలకు లింగ నిర్దారణ పరీక్షలు చేస్తూ డబ్బులు దండుకుంటున్న ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చిట్యాలలోని భవాని, సాయితేజ, నార్కట్‌పల్లిలోని చైతన్య, చౌటుప్పల్‌లోని ఉషారాణి ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ, ఆడపిల్లని తేలితే అబార్షన్లు చేస్తున్నారని సఖి సెంటర్‌ కో ఆర్డినేటర్‌ మందాకిని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: లోన్ యాప్ ప్రతినిధుల వేధింపులు.. సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య

దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. కొంతమంది ఆర్‌ఎంపీలు లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తూ ప్రజల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని తేల్చారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు పలు ఆస్పత్రులపై దాడులు చేసి ఆధారాలు సేకరించారు. దీంతో బాధ్యులపై కేసులు నమోదు చేసిన పోలీసులు 9మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు అబార్షన్లు చేస్తున్న ఆస్పత్రులను సీజ్ చేశారు. పరారీలో ఉన్న 8మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here