నాగశౌర్య బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ లక్ష్య టీజర్‌ని ఒక నిమిషం 8 సెకనుల నిడివితో కట్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. ‘చాలామందికి ఆటతో గుర్తింపు వస్తుంది.. కానీ ఎవడో ఒకడు ఉంటాడు ఆటకే గుర్తింపు తెచ్చేవాడు’ అని జగపతి బాబు వాయిస్‌తో వస్తున్న పవర్ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమై.. చివరి వరకు ఆకట్టుకుంటోంది ఈ టీజర్. ఈ వీడియోలో రెండు విభిన్నమైన గెటప్‌లలో దర్శనమిచ్చాడు హీరో నాగశౌర్య. అందులో ఒకటి నేచురల్ లుక్ కాగా.. మరొకటి 8 ప్యాక్ గెటప్. ఇకపోతే ‘పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం’ అనే డైలాగ్ సినిమాపై ఆతృతను పెంచేసింది.
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఆర్చరీపై వస్తున్న మొట్టమొదటి చిత్రం ఈ ‘లక్ష్య’ కావడం విశేషం. ఈ చిత్రంలో సీనియర్ హీరో జగపతి బాబు రోల్ కథను మలుపుతిప్పేదిగా ఉంటుందని టాక్. మొత్తానికైతే ఈ టీజర్‌తో ‘లక్ష్య’ మూవీపావు ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయనే చెప్పుకోవాలి. అతిత్వరలో చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

నాగశౌర్య ‘లక్ష్య’టీజర్