ప్రధానాంశాలు:
- నేడు కొణిదెల అంజనా దేవి పుట్టినరోజు
- ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి, నాగబాబు
- వీడియో షేర్ చేసిన మెగాస్టార్
‘నా ప్రియాతి ప్రియమైన అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రతి ప్రయత్నం వెనుక బలం అమ్మే. పాతాళానికి పడిపోయిన సమయాల్లో నా మార్గంలో వెలుగులు నింపిన కాంతి అమ్మ. నా బాధలన్నింటిని మటుమాయం చేసేలా నువ్వు వాత్సల్యంతో హత్తుకున్నందుకు కృతజ్ఞతలు చెబితే సరిపోదమ్మా! నీ ఓదార్పు మాటలు చిన్నవే కావొచ్చు కానీ, జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొనేంత శక్తినిస్తాయి. నేనివాళ ఎంతో దృఢమైన వ్యక్తిలా నిలబడ్డానంటే అందుకు కారణం నీలాంటి శక్తిమంతమైన తల్లి పెంపకం వల్లే. ఈ జీవితాన్నిచ్చినందుకు కృతజ్ఞతలు అమ్మా. సముద్రం లాంటి ఈ జీవితంలో నేను నిలబడటానికి యాంకర్లా ఉన్నందుకు కృతజ్ఞతలు’ అని నాగబాబు తన సందేశంలో పేర్కొన్నారు.
మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియోతో తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తమ్ముళ్లు, చెల్లెళ్లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అమ్మతో దిగిన ఫొటోలతో ఈ వీడియోను రూపొందించారు. ‘డాడీ’లోని గుమ్మాడి గుమ్మాడి పాటను జోడించి తయారుచేశారు. ‘జన్మనిచ్చిన అమ్మకి జన్మ దిన శుభాకాంక్షలు!’ అంటూ ఈ ట్వీట్ చేశారు చిరు. అంతేకాదు, అమ్మ పుట్టినరోజు నాడే తన కొత్త సినిమా ‘ఆచార్య’ టీజర్‌ను కూడా విడుదల చేశారు.