Naarappa: 'నారప్ప' షూటింగ్ పూర్తి.. మరో యువ దర్శకుడికి వెంకీ గ్రీన్ సిగ్నల్!

0
26



నేటితరం హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరోలు. ఈ క్రమంలోనే విక్టరీ తన లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ షూటింగ్ కంప్లీట్ చేశారు. తమిళంలో ధనుష్ నటించిన ‘అసురన్’కు రీమేక్‌గా తెలుగులో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో హీరోగా వెంకటేష్ నటిస్తుండగా.. హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ఫినిష్ అయిన విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు వెంకటేష్.

”నారప్పతో నా ప్రయాణం నేటితో పూర్తయింది. సినిమా విడుదల కోసం అందరూ వేచి ఉండండి” అని ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని పోస్ట్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకీ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో రావు రమేష్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల నడుమ మే 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ చేస్తూనే తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టిన వెంకటేష్.. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న F3 సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా ఈ ఫన్ రైడ్ తెరకెక్కుతోంది. ఈ మూవీ షూటింగ్ చేస్తూనే మరో యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో సినిమా చేసేందుకు వెంకటేష్ కమిటైనట్లు తెలుస్తోంది. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే ఈ సినిమా కూడా రూపొందనుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here