ప్రధానాంశాలు:
- ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబోలో మూవీ
- శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్
- హీరోయిన్ని ఫైనల్ చేసిన త్రివిక్రమ్
ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంతో థియేటర్లన్నీ నందమూరి అభిమానుల ఈలలతో గోల పెట్టాల్సిందే అని ఫిక్స్ అయిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేసేందుకు బాలీవుడ్ బ్యూటీ వరీన హుస్సేన్ని రంగంలోకి దించుతున్నారట. ఇప్పటికే ఈమెతో టెస్ట్ ఫొటోషూట్ కూడా ఫినిష్ అయిందని, త్రివిక్రమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాలో తారక్ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తాడనే ప్రచారం కూడా జరుగుతుండటం మరింత ఆసక్తికరంగా మారింది. చిత్రంలో వరీన హుస్సేన్ సెకండ్ హీరోయిన్గా నటించనుందని అంటున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్.రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతలుగా పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, అతిత్వరలో ఈ సినిమా సెట్స్ మీదకొస్తానని త్రివిక్రమ్‌కి మాటిచ్చారట. ఎన్టీఆర్ కోసం పదునైన మాటలతో కూడిన ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రెడీ చేశారని, ఇందులో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందని టాక్ బయటకు రావడంతో.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.