అరేబియా సముద్రంలో ఓ నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు సెయిలర్లు గల్లంతయ్యారు. మరో సెయిలర్ను రెస్క్యూ టీమ్ రక్షించింది. ముంబై తీరం నుంచి 170 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఓఎన్జీసీకి చెందిన Offshore Vessel రోహిణి ఈ ప్రమాదం బారినపడింది. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. శనివారం (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
గర్బీందర్ సింగ్ (37) అనే సెయిలర్ను హెలికాప్టర్ ద్వారా రక్షించి తీరానికి తీసుకొచ్చారు. ఆస్ప్రత్రిలో చేర్పించారు. ఓడలో ఆయన ఎలక్ట్రో టెక్నలాజికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు. స్వల్పంగా కాలిన గాయాలతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రెస్క్యూ ఆపరేషన్
సముద్రాల్లో చమురు వెలికితీత, నిర్మాణ పనుల్లో ఈ తరహా భారీ నౌకలను వినియోగిస్తారు.