ఆరే పోలీస్ స్టేషన్ పోలీసులు కొంత కాలంగా ఖోప్డి కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అతడు పోలీసులకు ఓ ఇన్ఫార్మర్ ద్వారా సందేశాన్ని పంపించాడు. ‘దేవుడు కూడా నన్ను పట్టుకోలేడు.. పోలీసుల గురించి మరచిపోండి’ అని అందులో పేర్కొన్నాడు. ఈ సవాల్‌ను ఆరే పోలీసులు స్వీకరించారు. ఖోప్డిపై నిఘా పెంచారు.
రాయల్ పామ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఖోప్డి దొంగతనానికి ప్లాన్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమయ్యారు. కొంత మంది పోలీసులు శుక్రవారం (ఫిబ్రవరి 5) సివిల్ డ్రెస్‌లో ఉండి అక్కడ నిఘా పెట్టారు. ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు వేసిన స్కెచ్‌కు ఖోప్డీ షాకయ్యాడు. అతడి వద్ద నుంచి పోలీసులు ఓ దేశీయ తుపాకీ, బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణ నిమిత్తం నిందితుడిని అప్పగిస్తామని ఆరే పోలీసులు తెలిపారు.