పతంగి వైపే చూస్తూ పరుగెత్తిన ఆ బాలుడు తన ముందు పేడ గుంత ఉన్న విషయం గమనించలేదు. ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయి లోపలికి జారుకున్నాడు. అక్కడే పనిచేస్తున్న కొంత మంది కార్మికులు జాదవ్ ఆ గుంతలో పడిపోవడం గమనించారు. కానీ, వారికి అతడిని రక్షించే మార్గం తెలియలేదు. ఆ గుంతలోకి దిగేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

పేడ గుంతలో పడిపోయిన బాలుడు
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని బాలుడిని బయటకు తీశారు. వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ విషయం చెప్పగానే జాదవ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.