బాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. విలక్షణ నటుడు, ఎం.ఎస్. ధోనీ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కో-స్టార్ సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వార్త వెలుగులోకి రావడానికి ముందు ఆయన తన ఫేస్బుక్ పేజీలో ఒక వీడియో పోస్టు చేశారు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు ఆ వీడియోలో తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదని అన్నారు. ఇటు వ్యక్తిగత జీవితంలో అటు వృత్తి రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.