చిన్నారి కోసం వెదుకుతున్న కుటుంబసభ్యులకు అదే రోజు సాయంత్రం గ్రామ శివారుల్లో బాలిక శవమై కనిపించింది. తమ ఇంటికి 200 మీటర్ల దూరంలో బాలిక మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారిని నిందితుడితోనే చివరిసారిగా చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు అన్నారు. దీంతో అతడిని అరెస్ట్ చేసి ప్రశ్నించడంతో తాను అత్యాచారానికి పాల్పడి హత్యచేసినట్టు అంగీకరించాడు.
తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి వలస వెళ్లడంతో తాతానాయినమ్మలతో బాలిక ఉంటోందని అన్నారు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు తెలిపారు. చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశచూపి తీసుకెళ్లినట్టు గ్రామస్థులు తెలిపారు. అతడిని చూడగానే మరో ఇద్దరు పిల్లలు భయంతో ఇంటిలోకి పరుగులు తీశారని అన్నారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి బంధువులు, గ్రామస్థులు రహదారిపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. జనం భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తగిన న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.