Monal Gajjar: మహేష్ బాబు సినిమాలో మోనాల్ గజ్జర్ ఆటా పాటా!! – monal gajjar reportedly do a special song in mahesh babu sarkaru vaari paata

0
28


ప్రధానాంశాలు:

  • పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’
  • ప్రస్తుతం దుబాయ్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రం
  • మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా కీర్తి సురేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ను దుబాయ్‌లో మొదలుపెట్టిన విషయం తెలసిందే. పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్‌లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రమిది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ‘సర్కారు వారి పాట’లో ఒక ప్రత్యేక పాట చేయబోతున్నారని టాక్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి మోనాల్ స్టెప్పులేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఫాస్ట్ బీట్‌కు మోనాల్ స్టెప్పులు అదిరిపోయాయని అన్నారు. అలాగే, ఆమె గ్లామర్ కూడా ప్లస్ అయ్యిందని కొనియాడారు. అయితే, ఈ సినిమా యావరేట్ టాక్‌ను దక్కించుకుంది.

‘ఆహా’లో రవితేజ ‘క్రాక్’.. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్
ఇదిలా ఉంటే, ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో అయిన మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’లో స్టెప్పులేయబోతున్నారట మోనాల్. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే గనుక నిజమైతే మోనాల్ బంపరాఫర్ కొట్టేసినట్టే. కాగా, ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మధి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here