ప్రధానాంశాలు:
- రైతుల ఉద్యమంపై పోర్న్ స్టార్ మియా ఖలీఫా స్పందన
- స్ప్రహ లోనే ఉన్నా అంటూ పోస్ట్
- కామెంట్లతో రచ్చ చేస్తున్న నెటిజన్లు
ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం, రైతులను యాక్టర్స్ అంటూ విమర్శలు చేస్తున్న వ్యక్తులపై మండిపడుతూ మియా ఖలీఫా ట్వీట్స్ చేసింది. ‘స్టాప్ కిల్లింగ్ ఫార్మర్స్’ అనే ప్లకార్డు పట్టుకున్న రైతుల ఫొటోను షేర్ చేస్తూ ‘‘ఇందులో మానవ హక్కుల ఉల్లంఘన ఏముంది? ఢిల్లీలో ఇంటర్నెట్ ఎందుకు కట్ చేశారు?’’ అని పేర్కొంది. దీంతోపాటు #FarmersProtest హ్యాష్‌ట్యాగ్ జోడించడమే గాక, రైతులను పెయిడ్ యాక్టర్స్ అని విమర్శిస్తున్న వ్యక్తులపై మండిపడింది. దీంతో ఈ పోర్న్ స్టార్ చేసిన ట్వీట్స్ నెట్టింట దుమారం రేపాయి. కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు.
ఇక ఈ ఇష్యూపై.. అసలు నీకు ఏం తెలుసని రైతులకు మద్దతు తెలుపుతున్నావంటూ కొందరు బీజేపీ మద్దతుదారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ‘మియా ఖలీఫా స్ప్రహలోకి రా!’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆమెపై సెటైర్స్ వేస్తున్నారు. దీంతో దీనిపై కూడా రియాక్ట్ అయిన మియా.. ”నేను స్ప్రహలోనే ఉన్నా. అనవసరంగా నాపై మీరు చేస్తున్న ఆందోళనలకు ధన్యవాదాలు. నేను ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నా” అని పేర్కొంది. దీంతో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట రచ్చ చేస్తున్నాయి. పోర్న్ స్టార్ కావడంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. అబ్బో.. ఆ కామెంట్లు మాటల్లో చెప్పలేం బాబోయ్!.