ఏమిటీ కేసు?
2018లో #MeToo ఉద్యమం ఊపందుకున్న సంగతి తెలిసిందే. తమపై కూడా గతంలో లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపిస్తూ చాలా మంది మహిళలు ఈ ఉద్యమం కారణంగానే ముందుకు వచ్చి చెప్పారు. ఈ క్రమంలోనే 2018 అక్టోబర్‌లో దాదాపు 20 మంది మహిళా పాత్రికేయులు.. మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆయన ఓ పత్రికకు ఎడిటర్‌గా పని చేసే సమయంలో లైంగికంగా వేధించినట్లు వారు ఆరోపించారు.
వీళ్లందరిలో కెల్ల ఆయన పేరు బయటికి తీసిన తొలి వ్యక్తి . తాను గతంలో రాసిన ఓ కథనాన్ని రమణి 2018 అక్టోబర్ 8న రీట్వీట్ చేస్తూ, అందులో వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రస్తావించిన వ్యక్తి ఎంజే అక్బర్ అని వెల్లడించారు. న్యూస్ రూం బయట, లోపల కూడా ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు. ఈ ఆరోపణల కారణంగానే ఎంజే అక్బర్ 2018 అక్టోబర్ 17న తన పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై వ్యక్తిగతంగా పోరాడతానని ఆయన ప్రియా రమణిపై పరువు నష్టం దావా వేశారు. తాజాగా కోర్టు ప్రియా రమణిని నిర్దోషిగా ప్రకటించింది.