ప్రధానాంశాలు:
- మహేష్ బాబు- రాజమౌళి క్రేజీ కాంబో
- స్క్రిప్ట్ వర్క్స్ షురూ చేసిన విజయేంద్ర ప్రసాద్
- భారీ ప్లాన్.. పక్కాగా అమలు చేయాలని జక్కన్న ఫిక్స్
రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ కథను రాసే పనిలో ఉన్నారట. సాధారణంగానే బలమైన స్క్రిప్స్ రెడీ చేసి కొడుకు చేతిలో పెట్టే ఆయన ఈసారి మహేష్ కోసం ఎవరూ ఊహించని స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అడవి నేపథ్యంలో ఇప్పటి వరకు భారతీయ చిత్రపరిశ్రమ చూడని ఫారెస్ట్ యాక్షన్ ఎడ్వెంచర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని స్కెచ్చేశారట జక్కన్న. అందుకు తగ్గట్లుగా విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట.
ఇక రాజమౌళి సినిమా అంటే బడ్జెట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. వందల కోట్లు పెట్టి రూపొందించడానికి నిర్మాతలు క్యూ కట్టేస్తారు. పైగా మహేష్ బాబుతో సినిమా, అది కూడా ఫారెస్ట్ యాక్షన్ ఎడ్వెంచర్ కాబట్టి ఈ మూవీ కోసం ఓ రేంజ్ బడ్జెట్ కేటాయించనున్నారట. ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో పోరాట సన్నివేశాలు రూపొందించాలని ప్లాన్ చేసిన జక్కన్న, ఈ క్రేజీ ప్రాజెక్టును 2022లో సెట్స్‌పైకి తీసుకురావాలని స్కెచ్చేసినట్లు తెలుస్తోంది.
ఏదేమైనా ఈ కాంబినేషన్ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకుల్లో తాజాగా బయటకొచ్చిన స్క్రిప్ట్ మ్యాటర్ మరింత ఆతృత పెంచేసింది. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి తన RRR షూటింగ్ పనులతో బిజీగా ఉండగా, మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు.