లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్నీ ఆగిపోయాయి. అయితే ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో వరుస సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. పోటాపోటీగా విడుదల తేదీలను ప్రకటిస్తూ సినీ సందడిని తీసుకువస్తున్నారు మన హీరోలు. ‘సర్కారు వారి పాట’, ‘వకీల్ సాబ్’, ‘పుష్ప’, ‘ఎఫ్ 3’, ‘నారప్ప’, ‘వకీల్ సాబ్’, ‘కేజీఎఫ్’, ‘గని’ చిత్రాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటించగా.. శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్ర యూనిట్. ‘ఎగసిపడే సముద్రపు అలల్లో, మీరు కొలవలేనంత ప్రేమని పరిచయం చేయడానికి వస్తున్నాం.’ అంటూ ‘మహా సముద్రం’ టీమ్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.