మొత్తం 21 ఎకరాల భూమి సహా మిగతా ఆస్తులను సరిసమానంగా వీలునామా రాశాడు. ‘నా చిన్నతనం నుంచీ కుక్కలను ప్రేమించాను.. గతంలో నా పెంపు కుక్క చనిపోయిన తరువాత జాకీని నా అల్లుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాను.. ఇంట్లో గొడవ జరగడంతో నా మరణం తరువాత జాకీని పట్టించుకోరని భావించి వీలునామా ఆలోచన వచ్చింది. వీలునామపై నా కొడుకు కలత చెందాడు.. ఈ విషయం గ్రామ సర్పంచ్‌కు తెలియజేయడంతో ఆయన నా దగ్గరకు వచ్చి వీలునామాను రద్దు చేయమని కోరాడు. వీలునామా ఇంకా రద్దు చేయకపోయినా ఈ సమస్య కుటుంబంలోనే చర్చించి పరిష్కరించాం’ అని వర్మ తెలిపాడు.
దీనిపై గ్రామ సర్పంచ్ జమున ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. ‘నేను పంచాయతీలోని మరికొందరు సభ్యులతో కలిసి వర్మ ఇంటికి వెళ్లి, అలాంటి సంకల్పానికి విలువ లేదని, అది ఖచ్చితంగా కుటుంబంలో స్పర్ధలకు కారణమవుతుందని చెప్పడానికి ప్రయత్నించాను.. కుమారుడిపై ఆగ్రహంతో వీలునామా రాసి, నోటరీ చేయించాడడు. వీలునామాను రద్దు చేస్తానని ఆయన నాకు హామీ ఇచ్చాడు’ అని వ్యాఖ్యానించారు.