ప్రధానాంశాలు:
- శింబు పుట్టినరోజు సందర్భంగా ‘రీవైన్డ్’ టీజర్ విడుదల
- టీజర్‌ను విడుదల చేసిన మాస్ మహారాజా రవితేజ
- వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న పొలిటికల్ థ్రిల్లర్
‘‘శింబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు!! ‘రీవైన్డ్’ టీజర్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా గ్రిప్పింగ్‌గా కనిపిస్తోంది. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు’’ అని రవితేజ ట్వీట్ చేశారు.
రవితేజ చెప్పినట్టుగానే ‘రీవైన్డ్’ టీజర్ చాలా ఆసక్తికరంగా, కొత్తగా ఉంది. ఎందుకంటే ఈ టీజర్ మొదలైనప్పటి నుంచీ సన్నివేశాలు వెనక్కి ప్లే అవుతున్నాయి. ‘యువర్ టైమ్ స్టార్ట్స్ నవ్’ అనే శింబు డైలాగ్, ఆయన పరిగెత్తడం, బైక్‌పై దూసుకెళ్లడం మినహా.. మిగిలిన సన్నివేశాలన్నీ వెనక్కే ప్లే అయ్యాయి. మరి ఈ రీవైన్డ్ కాన్సెప్ట్ ఏంటో చిత్ర యూనిట్ వివరణ ఇస్తే కానీ స్పష్టత రాదు. మొత్తం మీద ఈ టీజర్‌తో ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోగలిగారు. ఈ టీజర్లో మరో హైలైట్ యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం. చాలా బాగుంది.
పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండటం గమనార్హం. ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య, కరుణాకరన్ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. ఈ చిత్రానికి రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీన్ కేఎల్ ఎడిటర్. ఉమేష్ జె కుమార్ ఆర్ట్ డైరెక్టర్. స్టంట్ సిల్వ యాక్షన్ డైరెక్టర్. వాసుకి భాస్కర్ కాస్ట్యూమ్ డిజైనర్. రాజు సుందరం కొరియోగ్రఫీ అందిస్తున్నారు. కాగా, ఈ చిత్రం హిందీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, తమిళ్ టీజర్‌ను ఎ.ఆర్.రెహమాన్, కన్నడ టీజర్‌ను కిచ్చా సుదీప్ విడుదల చేశారు.

టీజర్: శింబు ‘మానాడు’.. తెలుగులో ‘రీవైన్డ్’