‘మీ పరిపాలనలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని భారత యువతపై దారుణమైన క్రూరత్వాల పరంపర కొనసాగుతోంది.. దేశంలోని భారతీయులు స్వేచ్ఛాయుత పౌరులుగా తమ జీవితాలను గడపాలని కోరుకుంటారు’ అని ధ్వజమెత్తారు. ఇటీవల యూపీలో మతమార్పిడి చట్టం పేరుతో జరుగుతున్న అకృత్యాలను ఈ లేఖలో ప్రస్తావించారు. మతమార్పిడి పాల్పడ్డారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులపై భజరంగ్ దళ్ కార్యకర్తలు, పోలీసులు దారుణంగ వ్యవహరించన ఘటనను ఇందులో లేవనెత్తారు.
“అమాయకులైన దంపతులను వేధించి, ఇబ్బందులకు గురిచేస్తే పోలీసులు మౌనంగా ఉన్నారు. బహుశా ఆ వేధింపుల ఫలితంగా ఆ మహిళకు గర్భస్రావం జరిగింది’ అని అన్నారు. యూపీలోని బిజినోర్‌లో ఇద్దరు టీనేజర్లపై ఆకస్మికంగా దాడిచేసి, వేధించిన తర్వాత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఓ 16 ఏళ్ల హిందూ బాలికను బలవంతంగా మతం మార్చినట్టు ఆరోపణలు గుప్పించి, ఓ టీనేజర్‌కు వారం రోజుల పాటు జైల్లో ఉంచారు. అయితే, ఈ ఆరోపణలు సదరు బాలిక, ఆమె తల్లి కొట్టిపారేశారు.
‘ఈ దురాగతాలు, చట్ట పాలనకు బద్ధులై ఉన్న భారతీయుల భావాలతో సంబంధం లేకుండా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.. మత మార్పిడి వ్యతిరేక ఆర్డినెన్స్ … ముఖ్యంగా ముస్లిం యువకులు, స్వేచ్ఛను ఉపయోగించుకునే ధైర్యం ఉన్న మహిళల కోసం ఒక కర్రగా ఉపయోగిస్తున్నారు’ అని లేఖలో మండిపడ్డారు. లవ్ జీహాదీపై అలహాబాద్ హైకోర్టు సహా పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ లేఖలో ప్రస్తావించారు.
‘జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని అలహాబాద్ హైకోర్టు సహా పలు హైకోర్టులు నిస్సందేహంగా తీర్పులు వెలువరించాయి.. యూపీ మాత్రం ఆ రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది’ అని ధ్వజమెత్తారు.