
ఆహారం కోసం వెతుకుతూ ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చింది. చిరుతపులిని చూడగానే ఓ వీధి కుక్కకు గుండె ఆగినంత పనైంది. చిరుత నుంచి తప్పించుకునే క్రమంలో విధుల వెంట పరుగెడుతూ చివరికి ఓ బాత్రూమ్లో దూరింది. ఎదురుగా చూస్తే.. షాకింగ్! ఆ టాయిలెట్లో చిరుత అప్పటికే దూరింది. ఎదురుగా పెద్ద పులిని చూసి శునకం అవాక్కైంది. ఈ ఫొటోలోని దృశ్యం అదే.
గ్రామస్థులను చూసి ఆందోళనకు గురైన చిరుత అప్పటికే బాత్రూంలో దూరింది. ఆ విషయం తెలియక కుక్క కూడా అదే బాత్రూమ్లోకి వచ్చి చేరింది. అయితే.. ఇద్దరమూ ప్రమాదంలో ఉన్నామని భావించాయేమో.. ఆ రెండు జంతువులు ఒక అండర్స్టాండింగ్ వచ్చాయి. టాయిలెట్లో చెరో మూలన నక్కాయి. కుక్క జోలికి పులి వెళ్లలేదు. పులి మీదకి కుక్క అరవలేదు. చుప్, చాప్..!
ఈలోగా సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చారు. చిరుత కోసం బోను, వలలు ఏర్పాటు చేశారు. ముందుగా కుక్కను రక్షించారు. కానీ, అప్పటికే చిరుత పారిపోయింది. ఇక దాని కోసం వేట సాగిస్తున్నారు. కర్ణాటకలోని కైకాంబ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు మిర్రర్ ట్వీట్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు.
ఆహారం కోసం వేటాడుతున్న పులి ముందుకే పోయినట్లుంది కదూ ఆ శునకం పరిస్థితి. జీవితంలో మనిషికి కూడా కొన్ని సార్లు ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి. ప్రమాదం నుంచి తప్పించుకున్న వారికి ఆ సందర్భం గుర్తొచ్చినప్పుడల్లా మోముపై నవ్వులు విరబూస్తాయి.
Like this:
Like Loading...