ప్రధానాంశాలు:
- హాట్ లుక్స్ షేర్ చేసిన లావణ్య త్రిపాఠి
- ఆ కామెంట్‌తో వైరల్
- యంగ్ హీరోలతో వరుస ప్రాజెక్ట్స్
‘ఈ రోజు బాధపెట్టే విషయమే రేపు మీలో బలం నింపుతుంది’ అంటూ జనాల్లో పాజిటివిటీని జొప్పిస్తూ ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా తన హాట్ లుక్స్ షేర్ చేసింది లావణ్య త్రిపాఠి. అంతేకాదు ఈ ఫొటోషూట్‌కు చాలా ఎక్కువ సమయం పట్టిందని, ఇది తన ఫేవరైట్ ఫోటోషూట్ అని పేర్కొంటూ అభిమానులకు కిక్కిచ్చింది. లావణ్య పోస్ట్ చేసిన ఈ లుక్స్ చూసి ”సో.. బ్యూటిఫుల్, అందాల రాక్షసి, సూపర్, సెక్సీ పోజ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
లావణ్య సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం యంగ్ హీరో సందీప్ కిషన్‌తో కలిసి ‘A1 ఎక్స్‌ప్రెస్’ మూవీలో నటిస్తోంది. హాకీ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రమిది. ఇందులో హాకీ ప్లేయర్‌గా లావణ్య నటన అబ్బురపరచనుందని టాక్. అలాగే మరో యంగ్ హీరో కార్తికేయ సరసన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రంలో ‘మల్లిక’ పాత్రలో ఆమె కనిపించనుంది.