Lavanya Tripathi: నీ మొహానికి లావణ్య త్రిపాఠి కావాలేంట్రా అంటారనుకున్నా: హీరో కార్తికేయ – kartikeya humble speech at chaavu kaburu challaga press meet

0
19


ప్రధానాంశాలు:

  • మార్చి 19న విడుదలవుతోన్న ‘చావు కబురు చల్లగా’
  • వైవిధ్యపాత్రలో నటించిన కార్తికేయ
  • ప్రెస్ మీట్‌లో విధేయతతో ఆకట్టుకున్న హీరో

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దలంటారు. ప్రస్తుతం హీరో కార్తికేయ అదే ఫాలో అవుతున్నారు. ‘ఆర్ఎక్స్ 100’తో హీరోగా పరిచయమై తొలి చిత్రంతోనే స్టార్‌డమ్ సంపాదించిన కార్తికేయ.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నటుడిగా తనను తాను నిరూపించుకున్నారు. అయినప్పటికీ ఆయన గర్వాన్ని ప్రదర్శించట్లేదు. తనను తాను ఇంకా ఎంతో నిరూపించుకోవాలనే అంటున్నారు. ప్రతి ఒక్కరితో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తున్నారు. పాల్గొన్న ప్రతి కార్యక్రమంలో విధేయతతో కనిపిస్తున్నారు. తాజాగా ‘చావు కబురు చల్లగా’ ప్రెస్ మీట్‌లోనూ కార్తికేయ మాటల్లో ఎంతో విధేయత కనిపించింది.

‘టక్ జగదీష్’ టీజర్: పారాణి కాళ్లతో నాని ఫైటింగ్.. పండగలాంటి సినిమా
‘భలే భలే మగాడివోయ్’, ‘గీతా గోవిందం’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై కార్తికేయ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. బన్నీ వాసు నిర్మాత. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించారు. జేక్స్ బెజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాను నుంచి ‘కదిలే కళ్లనడిగా’ అంటూ సాగే పాటను మంగళవారం మీడియా సమక్షంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లు కార్తికేయ, లావణ్య త్రిపాఠి, దర్శకుడు కౌశిక్, నిర్మాత బన్నీ వాసు పాల్గొన్నారు.

Chaavu Kaburu Challaga Press Meet

ప్రెస్ మీట్‌లో బన్నీ వాసు, కార్తికేయ, లావణ్య, కౌశిక్

ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘ప్రతి సినిమాకి యాక్టర్స్ కాన్ఫిడెంట్‌గానే ఉంటాం. కానీ, ఒక సినిమా బాగుంటే మనకు ఎదురైన వాళ్లే మనం చెప్పక ముందే ఆ సినిమా గురించి మన దగ్గర చెబుతారు. నాకు ఇలా ‘ఆర్ఎక్స్ 100’ సినిమాకు చెప్పారు.. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాకు చెబుతున్నారు. సినిమా బాగుంటే ఇలా చెప్తారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ సినిమా చేయడం నా అదృష్టం.. అంతకు మించి నేనేం చెప్పలేను. ఈ సినిమాను నేను ఎంపిక చేసుకున్నాను అని చెప్పడం చాలా తప్పవుతుంది. గీతా ఆర్ట్స్, అరవింద్ గారు, వాసు గారు, కౌశిక్ రాసిన గ్రేట్ స్క్రిప్ట్.. వీళ్లను నేను ఎంపిక చేసుకున్నానంత సీన్ లేదు. వాళ్లు నన్ను ఎంపిక చేసుకున్నారు.

నేను ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో నటన ఒక ఎత్తయితే.. ఈ సినిమాలో మరో ఎత్తు. చాలా వైవిధ్యంగా ఉంటుంది. కౌశిక్ నాలో ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నాడో తెలీదు. కాకపోతే ఆ ఒత్తిడితోనే చాలా కష్టపడ్డాను. కొత్త యాస, పాత్ర శైలి, ఫ్రీ స్టైల్ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ నేను ఫస్ట్ టైమ్ చేశాను. చేసినప్పుడు కాస్త భయమేసింది. కాకపోతే అరవింద్ గారు, వాసు గారు నాకు ధైర్యం చెప్పారు. అరవింద్ గారు నిన్న ఫోన్ చేసి మాట్లాడేసరికి చాలా ధైర్యం వచ్చింది. చాలా బాగా చేశావ్ అని ఆయన చెబుతుంటే పర్వాలేదు పనికొస్తాం అని అనిపించింది.

కౌశిక్ థాంక్స్ అంటే అది చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే, తన వల్లే ఇదంతా పాజిబుల్ అయ్యింది. ఈ సినిమాకు నేనయితే బాగుంటానని ఆయనే అరవింద్ గారికి, వాసు గారికి చెప్పాడు. తను ఏం చెప్పాడో నేను అది చేశాను అంతే. నేను కొత్తగా ఏమీ చేయలేదు. కథ చెప్పినప్పుడే మనసులో అనుకున్నా.. ఇప్పటి వరకు పెద్ద హీరోయిన్‌తో చేయలేదు, ఎవరిని పెడతారో అని. కానీ, బయటకు అడగలేదు. తరవాత ఒకరోజు లావణ్య త్రిపాఠిలా ఉంటే బాగుంటది అని కౌశిక్ అన్నాడు. లా.. ఎందుకు పెట్టొచ్చు కదా అని మనసులో అనుకున్నాను. అడిగితే నీ మొహానికి లావణ్య కావాలేంట్రా అని అంటారని అడగలేదు. తరవాత లావణ్య త్రిపాఠి హీరోయిన్ అనగానే.. ఒకే, మనం హీరో అయ్యామన్న మాట అని అనిపించింది’’ అని చాలా ఓపెన్‌గా మాట్లాడారు.

‘చావు కబురు చల్లగా..!’ పాట: కదిలే కాలాన్నడిగా అంటోన్న కార్తికేయ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here