Krithi Shetty: Chiranjeevi: ఉప్పెనంత ప్రశంస.. చిరంజీవి మాటకు ఉప్పొంగిపోతున్న కృతిశెట్టి – chiranjeevi applauds krithi shetty, says you are a born star

0
21


తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకున్నారు యువ నటి కృతిశెట్టి. ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైపోయారు. విమర్శకులు, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్న కృతిశెట్టి.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనసు గెలుచుకున్నారు. ఆయన నుంచి ఉప్పెనంత ప్రశంసను అందుకున్నారు. ఈ మేరకు కృతిశెట్టికి చిరంజీవి ఒక లేఖ రాశారు. ఆ లేఖను ట్వీట్ చేసిన కృతిశెట్టి.. చిరంజీవి బంగారు మాటలను జీవితాంతం తన గుండెలో ఉంచుకుంటానని పేర్కొన్నారు.

కృతిశెట్టిని ‘బోర్న్ స్టార్’ (నటించడానికే పుట్టిందని) అభివర్ణించిన మెగాస్టార్ చిరంజీవి.. ‘నువ్వు కేవలం స్టార్ అని మాత్రమే కాదు అద్భుతమైన నటివని కూడా నిరూపించుకున్నావు’ అని ప్రశంసించారు. ఒక్క వారం రోజుల్లోనే భాషను నేర్చుకుని అద్భుతంగా నటించి అద్భుతమైన అమ్మాయిగా కృతిశెట్టి నిరూపించుకుందని కొనియాడారు. ‘ఉప్పెన’తో ఘనవిజయం అందుకున్న కృతిశెట్టికి తాను మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ బేబమ్మపై తమ ప్రేమను, ఆప్యాయతను కురిపిస్తారని అన్నారు.

ప్రేమలో మునిగి ఉన్న వెన్నెల.. సాయిపల్లవి ఆసక్తికర ట్వీట్
చిరంజీవి లేఖను ట్వీట్ చేసిన కృతిశెట్టి.. ‘‘చిరంజీవి గారికి చాలా కృతజ్ఞతలు. నిజంగా మీ లేఖ నా హృదయాన్ని హత్తుకుంది. మీ అందమైన బహుమతి, మీ బంగారు మాటలు ఎప్పటికీ నా గుండెలో నిలిచిపోతాయి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను.. మీ ఆశీస్సులు అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here