Krack Trailer Date: ర‌వితేజ‌ ‘క్రాక్’ ట్రైల‌ర్: ముహూర్తం ఖరారు.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ – ravi teja, gopichand malineni krack trailer to be out on january 1st

0
33


మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, డైరెక్టర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’ షూటింగ్ పాట‌ల‌తో స‌హా మొత్తం పూర్తయింది. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈలోగా నూత‌న సంవ‌త్సరానికి స్వాగతం ప‌లుకుతూ జ‌న‌వ‌రి 1న చిత్ర బృందం థియేట్రిక‌ల్‌ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌నుంది. ఇది ర‌వితేజ ఫ్యాన్స్‌కు ఓ ట్రీట్‌.

ట్రైల‌ర్ రిలీజ్‌ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌‌ను సోమవారం విడుదల చేసింది చిత్ర బృందం. ర‌వితేజ, శ్రుతిహాస‌న్ హుషారుగా ఓ పాట‌లో డాన్స్ చేస్తూ పోస్టర్‌లో క‌నిపిస్తున్నారు. ర‌వితేజ బ్లాక్ డ్రెస్‌లో ఎప్పట్లా ఫుల్ ఎన‌ర్జీతో క‌నిపిస్తుంటే, శ్రుతి అల్ట్రా మోడ‌ర‌న్ లుక్‌లో అల‌రిస్తున్నారు. ఆ ఇద్దరి మ‌ధ్యా కెమిస్ట్రీ చూస్తుంటే రేపు థియేట‌ర్లలో ఆడియెన్స్‌కు పండ‌గేన‌ని చెప్పొచ్చు.

Krack Movie

‘క్రాక్’ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్

ఈ చిత్రానికి ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చగా.. ఇప్పటికే విడుద‌లైన మూడు పాట‌లు సంగీత ప్రియుల‌ను అల‌రించాయి. చివ‌ర‌గా రిలీజ్ చేసిన ‘‘కోర‌మీసం పోలీసోడా..’’ పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్‌’లో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకొనే అంశాలున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది.

థియేటర్ల ఆక్యుపెన్సీని 100 శాతానికి పెంచండి.. సీఎంను కలిసిన విజయ్
స‌ర‌స్వతి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో స‌ముద్రఖని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్టర్లలో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా పనిచేశారు. ఇంకా దేవీప్రసాద్‌, చిర‌గ్ జాని, మౌర్యని, సుధాక‌ర్ కోమాకుల‌, వంశీ చాగంటి ఇతర పాత్రలు పోషించారు. సాయిమాధవ్ బుర్రా డైలాగులు రాశారు. నవీన్ నూలి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేశారు. రామజోగయ్యశాస్త్రి పాటలు రాశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here