krack success meet: Thaman: ‘క్రాక్’ దర్శకుడి కంటతడి.. సక్సెస్ మీట్‌లో తమన్ భావోద్వేగం – music director thaman emotional speech at krack grand success celebrations

0
31


డాన్ శీను.. బలుపు వంటి చిత్రాలతో మాస్ రాజా రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. క్రాక్ సినిమాతో క్రాక్‌బ్లస్టర్ లాంటి హిట్ ఇచ్చి థియేటర్స్ వద్ద పండుగ సందడి తీసుకుని వచ్చారు. ఈ సినిమా విజయోత్సవ వేడుకను బుధవారం నాడు వైజాగ్‌లో నిర్వహించగా.. హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని, సంగీత దర్శకుడు తమన్.. ఈ చిత్రానికి పనిచేసిన ఇతర నటీనటులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమోషనల్ స్పీచ్‌తో ఆకట్టుకున్నాడు సంగీత దర్శకుడు తమన్. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ ఈ సినిమా కోసం పడ్డ కష్టాన్ని తెలియజేశారు.

తమన్ మాట్లాడుతూ.. ‘నా లైఫ్‌లో కిక్ ఇచ్చిన హీరో రవితేజ. ఆయన ఇచ్చిన కిక్‌తో 126 సినిమాలు అయిపోయాయి. ఇది మామూలు కిక్ కాదు. నాకు మళ్లీ మిరపకాయ లాంటి కిక్ ఇచ్చారు. ఉప్పు ఎక్కువైంది కాస్త కారం కూడా వేసుకో అని ఈ క్రాక్ ఇచ్చారు. ఆ తరువాత మా బావ (గోపీచంద్ మలినేని) వచ్చి నాకు బలుపు ఇచ్చాడు. ఇప్పుడు క్రాక్ ఎక్కించాడు. కిక్ ఫస్ట్ సినిమా.. క్రాక్ పదకొండే సినిమా.. వన్ ప్లస్ వన్ అయ్యింది. నేను రవితేజ సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తా.. పిచ్చోడ్ని అయిపోతా. ఆయన బాడీ లాంగ్వేజ్‌ని పట్టుకోవడం చాలాకష్టం. అందరూ ఆయన ఆరడుగులనే చూస్తారు.. ఆయన మరో ఆరడుగులు ఉంటారు. ఆ ఆరడుగుల్ని నేను చూస్తా.. ఈయనకు ఎలాంటి సాంగ్స్ ఇవ్వాలి అని. నాకు మళ్లీ మంచి అవకాశం ఇచ్చింది రవితేజ అన్న. నేను 11 సినిమాలు అన్నతోనే చేశా. నాకు ఎక్కువ సినిమాలు ఇచ్చిన హీరో మీరే అన్నా. లవ్యూ సోమచ్ అన్నా.

రవితేజకు యాప్ట్ టైటిల్ దొరికితే పండగ ఎలా ఉంటుందో ఈ క్రాక్ చిత్రంతో మళ్లీ నిరూపితం అయ్యింది. ‘క్రాక్’ అనే టైటిల్ అందరి మూడ్‌ని సెట్ చేసింది.

నేను ఎప్పటినుంచో గోపీచంద్‌కి మంచి టెక్నికల్ టీం దొరకాలని కోరుకున్నా. ఎందుకంటే అతనికి ఎన్నో ఆశలు ఆశయాలు ఉన్నాయి. మనసులో ఎన్నో దాచుకుంటాడు. అతను పైకి మాట్లాడలేడు కానీ.. సక్సెస్ లేకపోతే ఫిల్మ్ నగర్ రైట్ తీసుకోలేము. నేరుగా పంజాగుట్టే.

ఈ సినిమాకి గోపీచంద్ ఎంత కష్టపడ్డాడనేది చాలా భావోద్వేగంతో కూడుకున్నది. హైదరబాద్ టు చెన్నై ఇండిగో స్టాఫ్ కూడా తిరిగి ఉండదు. అంతలా తిరిగాడు. ఎక్కడున్నావ్ బావా అంటే వెళ్తున్నా వస్తున్నా.. అని అనేవాడు. నాకు చాలా బెంగగా ఉండేది. ఓ పక్కన కరోనా ఎలా ఉంటాడో ఏంటో అని.. మాస్క్‌లు, ఇమ్యునిటీ టాబ్లెట్స్‌ ఇచ్చేవాడ్ని.

ఈ సినిమా రిలీజ్ అప్పుడు చాలామంది చాలా డౌట్లు ఉన్నాయి. రిలీజ్ అయితే జనాలు వస్తారా?? సినిమా ఆడుతుందా? లేదా?? అని. కానీ ప్రేక్షకులు మాకు పండుగను ఐదురోజుల ముందుగానే చూపించేశారు. మీకు రుణపడి ఉంటాం.

ఈ సినిమా ఆర్ ఆర్ చేసేటప్పుడే అనుకున్నా.. ఈ సినిమా ఆర్ ఆర్ స్పీకర్లకు ఉన్న దుమ్ముని లేపుతుందని.. ఈ సినిమా ఫస్ట్ షో పడగానే.. అన్ని స్పీకర్ల లోనుంచి డస్ట్ వచ్చింది. గోపీ అనేవాడు.. తమన్ ఉన్నాడు అతను చూసుకుంటాడు అనే స్పేస్ ఇచ్చి నాకో నమ్మకంగా నిలిచాడు. అతను స్పేస్ ఇవ్వకపోతే నేను మ్యూజిక్ చేసే అవకాశం ఉండేది కాదు.

గోపీచంద్ నాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఇచ్చాడు.. బావా నువ్ ఆడుకో.. ఈ సినిమాని పైకి లేపు అని. సినిమాని ఎంతైనా లేపమని. ఇతను నాపై పెట్టుకున్న నమ్మకమే ఈ సినిమాకి బాగా ఔట్ పుట్ రావడానికి కారణం. నిజంగా చెప్తున్నా.. ఈ సినిమా గోపి కష్టమే. తన కంటతడి నేను చూశా. బావా ఈసినిమా నాకు చాలా ఇంపార్టెంట్ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. తను నన్ను హగ్ చేసుకున్నప్పుడు అతని కన్నీళ్లు నా షోల్డర్‌పై పడ్డాయి. ఫ్యామిలీకి దూరంగా ఉండి.. దాదాపు 28 రోజులు కష్టపడ్డాం. డిసెంబర్ 12 నుంచి జరవరి 5 వరకూ ఆఫీస్‌లోనే ఉన్నాం. గోపీ అయితే ఆఫీస్‌లోనే పడుకునేవాడు. ఎందుకంటే మనం ఇన్ని చోట్లకు తిరుగుతున్నాం.. ఈ కరోనా మనకి వస్తుందా? అనే భయంతో. మేం ఇద్దరం కూడా ఆఫీస్‌లోనే ఉన్నాం.. ఈరోజు క్రాక్ సినిమా సక్సెస్ చూసిన తరువాత మా బావ గోపీని చూస్తే నాకు గర్వంగా ఉంది’ అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు తమన్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here