లడఖ్‌లో భారత్ – చైనా సరిహద్దుల్లో 9 నెలలుగా ఉద్రిక్తతలు చోటు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందని, మన భూభాగాన్ని అక్రమించిందని కాంగ్రెస్ సహా విపక్ష నేతలు కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ మేరకు వార్తా కథనాలను వెలువరించాయి. చైనా దురాక్రమణ చేసిందంటూ శాటిలైట్ చిత్రాలను కూడా ప్రదర్శించాయి. రాహుల్ గాంధీ ఈ వ్యవహారంపై కేంద్రాన్ని నిలదీశారు.
భారతదేశాన్ని చైనా అక్రమిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోందని రాహుల్ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వ చేతగానితనం వల్లే సరిహద్దుల్లో చైనా దూకుడు విధానాలను అవలంభిస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. భారత్ శక్తి ఏమిటో శత్రు దేశాలకు తెలిసేలా చేశామని మరో ఆర్కే సింగ్ పేర్కొన్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే దీటుగా తిప్పికొడతామని ప్రపంచానికి భారత్ సందేశం ఇచ్చిందని ఆయన అన్నారు.