ప్రధానాంశాలు:
- లవ్ జీహాద్ చట్టంపై పార్లమెంట్లో కేంద్రం కీలక ప్రకటన.
- రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ను ప్రస్తావించిన కేంద్ర మంత్రి.
- మతాంతర వివాహాలపై తన వైఖరిని వెల్లడించిన కేంద్రం.
మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చే ఉద్దేశం కేంద్రానికి లేదని అన్నారు. ఈ మేరకు లోక్సభలో ఓ సభ్యుడి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మతాంతర వివాహాల వెనుక బలవంతపు మత మార్పిడులతో సంబంధం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందా అన్న ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
‘పబ్లిక్ ఆర్డర్, పోలీస్ ఈ అంశాలు రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్ ప్రకారం రాష్ట్రాల పరిధిలోకి వస్తాయన్నారు. మత మార్పిడిల నేరాలకు సంబంధించి కేసు నమోదు, నిర్బంధం, విచారణ ప్రాథమికంగా రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల పరిధిలోకి వస్తాయి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాయి’ అని అన్నారు.
మతాంతర వివాహాలను నిరోధించే చట్టాన్ని కేంద్రం తీసుకొస్తుందా అని మరో సభ్యుడు అడిగితే అటువంటిది ఏం లేదు అని బదులిచ్చారు. బలవంతపు మతమార్పిడికి సంబంధించి, మతాంతర వివాహాలను నియంత్రించడానికి కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు చట్టాలను అమలు చేసిన నేపథ్యంలో ఐదుగురు ఎంపీలు లిఖితపూర్వకంగా లోక్సభలో ప్రశ్నించారు.