Kinnerasaani Motion Poster: ‘కిన్నెర‌సాని’ మోష‌న్ పోస్టర్.. సరికొత్త అవతారంలో మెగా హీరో – kalyan dhev kinnerasaani motion poster out now

0
22


ప్రధానాంశాలు:

  • కళ్యాణ్ దేవ్ హీరోగా ‘కిన్నెరసాని’
  • ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ దర్శకుడు
  • కథ, కథనం అందిస్తోన్న ‘కల్కి’ ఫేమ్ దేశరాజ్ సాయితేజ

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతో పర్వాలేదనిపించిన కళ్యాణ్ దేవ్.. ఇప్పుడు వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘సూపర్ మచ్చి’ త్వరలోనే విడుదల కానుంది. దీంతో పాటు మరో రెండు సినిమాలు కళ్యాణ్ దేవ్ ఖాతాలో ఉన్నాయి. ఒక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌లో చేస్తున్న కాగా.. మరొకటి ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో చేస్తున్న సినిమా.

క‌ళ్యాణ్ దేవ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ర‌మ‌ణ తేజ (‘అశ్వథ్థామ’ ఫేమ్) దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘కిన్నెరసాని’. ఎస్.ఆర్.టి. ఎంటర్‌టైన్మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రజనీ తాళ్లూరి, రవి చింతల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌కు, ఆ త‌రువాత విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకు అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఫిబ్రవ‌రి 11న హీరో క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ‘కిన్నెర‌సాని’ చిత్రం బృందం ఓ మోష‌న్ పోస్టర్‌ని విడుద‌ల చేసింది.

అనసూయ ఫొటోతో పోస్టల్ స్టాంప్.. ఇంతకు మించిన గౌరవం ఉండదంటూ జబర్దస్త్ బ్యూటీ ఎమోషనల్
మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒక సరికొత్త అవతారంలో కళ్యాణ్ దేవ్ దర్శనమివ్వబోతున్నారని ఈ మోషన్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ క‌థ, క‌థ‌నం అందిస్తున్నారు. గ‌తంలో సాయితేజ్ ‘క‌ల్కి’ వంటి హిట్ చిత్రానికి స్టోరీ అందించ‌డం విశేషం. అలానే ‘ఛ‌లో’, ‘భీష్మ’ వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌కి సంగీతాన్ని అందించిన మ‌హ‌తి సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here