వచ్చే జీతం కుటుంబ పోషణకు చాలకపోవడంతో దొరికిన చోటల్లా అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంక కనిపించక, రుణదాతలు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యనుకున్నాడు. మంగళవారం రాత్రి తన ఇద్దరు బిడ్డలు గౌతమి (3), స్వరూప్ (2)కు పురుగులమందు తాగించాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక భార్య పార్వతి(27)తో కలిసి ఒకే దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బుధవారం ఉదయం వారిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాదిగనూరు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బుధవారం నంజుండ- పార్వతి ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. ఈలోగానే వారు ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త తెలిసి బంధువులు, సన్నిహితులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.