Kangana Ranaut: నా అంతటి నటి ఈ భూమి మీద లేదు.. ఇది నా సవాల్: కంగనా రనౌత్ – i have raw talent like meryl streep: kangana ranaut

0
18


ప్రధానాంశాలు:

  • వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కంగనా రనౌత్
  • రైతుల ఉద్యమం అంశంలో బీజేపీకి అండగా కంగనా
  • బాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌కీ లేనంత ఫాలోయింగ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు గర్వం, పొగరు ఎక్కువ అని చాలా మంది అంటుంటారు. ఇలా అనడానికి కారణం ఆమె ప్రవర్తన. ఏ విషయంలోనైనా ఆమె వెనకడుగు వేయరు. ఈ క్రమంలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. ఆ మధ్య తన కార్యాలయం కూల్చివేత అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఢీకొట్టారు. ఇది దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. ఆ తరవాత బాలీవుడ్ నటీమణులతో విభేదాలు.. రైతుల ఉద్యమం విషయంలో బీజేపీకి వత్తాసు.. ఇలా ఒకటి రెండు కాదు ఆమె వేలు పెట్టని వివాదం లేదు.

తాజాగా మరో వివాదానికి తెరలేపారు ‘క్వీన్’ కంగనా రనౌత్. ఈ భూగోళంలో ప్రస్తుతం తనను మించిన నటీమణి లేదంటూ బీరాలు పోతున్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ట్వీట్ చేశారు. తాను చేస్తోన్న రెండు సినిమాల్లోని స్టిల్స్‌ను ట్వీట్ చేసిన కంగనా.. వాటి మధ్య వ్యత్యాసం గురించి చెబుతూ తనలో భయంకరమైన నటి ఉందని వెల్లడించారు.

సత్యదేవ్ కొడుకు ఫస్ట్ బర్త్‌డే.. ఏంటీ, అన్నకు పెళ్లయి పిల్లోడు ఉన్నాడా?
‘‘ఒక నటిగా నేను చూపించే ఈ స్థాయిని ప్రస్తుతం ఈ భూగోళంలో మరే నటి చూపించలేదు. మెరిల్ స్ట్రీప్ (ప్రముఖ హాలీవుడ్ నటి) మాదిరిగా వైవిధ్యమైన పాత్రలు చేసే రా టాలెంట్ నాలో ఉంది. అలాగే, గాల్ గాడోట్ (ప్రముఖ ఇజ్రాయిల్ నటి) మాదిరిగా యాక్షన్ చేయగలను, గ్లామర్‌గా కనిపించగలను’’ అని కంగనా రనౌత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంటే, ప్రస్తుతం భూమిపై ఉన్న ఇద్దరు ప్రముఖ నటీమణుల లక్షణాలు ఈమెలో ఉన్నాయని చెబుతున్నారు కంగనా.

అంతటితో ఆగలేదు.. ‘‘నా కన్న గొప్పగా, అద్భుతంగా నటించే నటి ఈ భూమి మీద ఉందని నాకు చూపిస్తే నేను డిబేట్‌కు సిద్ధం. ఒక వేళ మీరు నిరూపిస్తే నేను నా అహంకారాన్ని వదులు కుంటున్నానని మాటిస్తున్నాను. అప్పటి వరకు ‘తలైవి’, ‘ధాకడ్’ గర్వాన్ని మీకు అందించగలను’’ అని కంగనా ట్వీట్ చేశారు.
మొత్తం మీద తన అహంకారాన్ని దించడానికి బహిరంగ సవాల్ విసిరారు. కానీ, ఎవరిప్పుడు అంత ఖాళీగా ఉన్నారు. అందుకే, కంగనాకు సవాల్ విసరడం మాని ట్విట్టర్‌లో ఆమెను తిట్టిపోస్తున్నారు. మరీ ఇంత అహంకారం పనికి రాదని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం కంగనా తన తదుపరి చిత్రం ‘ధాకడ్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అడ్వంచర్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఆమె ఇప్పటికే ‘తలైవి’ సినిమాను పూర్తిచేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here