kadapa tdp leader murder: కడప: కళ్లలో కారంకొట్టి.. టీడీపీ నేత దారుణ హత్య – tdp leader brutally murdered in proddatur of kadapa

0
88


కడప జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లాలోని ప్రొద్దుటూరు టీడీపీ నేత సుబ్బయ్యను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా చంపేశారు. కళ్లలో కారంకొట్టి.. మారణాయుధాలతో నరికి దారుణంగా హతమార్చారు. సోములవారిపల్లె సమీపంలోని ఖాళీ స్థలంలో ఈ ఘటన జరిగింది. పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే స్థలంలోనే సుబ్బయ్యను అత్యంత దారుణంగా హతమార్చారు. గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడన్న అక్కసుతోనే హత్య చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని సుబ్బయ్య మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

Also Read: కాబోయే భర్తని ఇంటికి రమ్మని.. ప్రియుడికి ఫోన్, కర్నూలులో యువతి దారుణం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here