2014లో సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో వారు బిజెపి సభ్యత్వం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత వైసీపీ పార్టీలో చేరి.. పార్టీ అధ్యక్షుడు, అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్తో విభేదించి.. తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించారు. ఇక 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీ పార్టీలో చేరి పార్టీ వ్యవహారాల్లో పాలుపంచుకున్నారు.
అయితే వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ జగన్ వీరిని దూరంగానే పెట్టడంతో చివరికి జీవిత తిరిగి మళ్లీ కాషాయ కండువాకప్పుకున్నారు. ఒక వైపు ఏపీ రాజకీయాలు మత విద్వేషాలతో హాట్ టాపిక్ అవుతుంటే ఈ తరుణంలో కాషాయ కండువా కప్పుకుని బీజేపీ పార్టీలో అడుగుపెట్టింది జీవితా రాజశేఖర్. అయితే జీవితను పార్టీలోకి ఆహ్వానించిన బండి సంజయ్.. ఆమెకు కండువా వేయడానికి నిరాకరించారు. దీంతో తనకు తానే కాషాయ కండువా కప్పుకుంది జీవితా రాజశేఖర్.