Jathi Ratnalu Teaser: ‘జాతిరత్నాలు’ టీజర్: తమన్నా సమంత ఔర్ రష్మిక.. కామెడీ పీక్స్ – naveen polishetty, priyadarshi and rahul ramakrishna jathi ratnalu teaser out

0
23


న‌వీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియ‌ద‌ర్శి టైటిల్ రోల్స్ పోషించిన చిత్రం ‘జాతిర‌త్నాలు’. కామెడీ క్యాప‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి అనుదీప్ కె.వి. ద‌ర్శకుడు. స్వప్న సినిమా బ్యాన‌ర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టించారు.

గురువారం సాయంత్రం ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. థియేట‌ర్లలో ఈ సినిమా న‌వ్వుల పువ్వులు పూయిస్తుంద‌ని టీజ‌ర్ తెలియ‌జేస్తోంది. ముగ్గురు ప్రధాన పాత్రధారులు న‌వీన్‌, రాహుల్ రామ‌కృష్ణ, ప్రియ‌ద‌ర్శి జైలులో ఖైదీలుగా న‌డ‌చుకుంటూ రావ‌డంతో టీజ‌ర్ మొద‌ల‌వుతుంది. జైల్లో ఉంటూ కామెడీ చేస్తున్నారు ఈ ఖైదీలు. సెల్‌లో నుంచి ప్రియ‌ద‌ర్శి త‌న‌వైపు ముగ్గురు ఉన్నార‌ని.. వారు త‌మ‌న్నా, స‌మంత అని చెప్పి, మూడో పేరు కోసం త‌డుముకుంటుంటే ర‌ష్మిక అని అందిస్తాడు న‌వీన్‌.

కన్ఫర్మ్: శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్.. ఈ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు
వినోదం మాత్రమే కాకుండా ఈ మూవీలో సీరియ‌స్ విష‌యం కూడా ఒక‌టి ఉంద‌ని ముర‌ళీ శ‌ర్మ ఎపిసోడ్ తెలుపుతోంది. రూ. 500 కోట్ల చుట్టూ ఈ సినిమా క‌థ న‌డుస్తుంద‌ని అర్థమ‌వుతుంది. న‌వీన్‌కు ఓ ల‌వ్ స్టోరీ కూడా ఉంద‌నే సంగతి ఈ టీజ‌ర్‌లో చూడొచ్చు. ర‌ధ‌న్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సిద్ధం మ‌నోహ‌ర్ సినిమాటోగ్రఫీ ఆసక్తికరంగా ఉన్నాయి. మార్చి 11న ‘జాతిర‌త్నాలు’ థియేట‌ర్లలో విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

ముర‌ళీ శ‌ర్మ, వీకే న‌రేష్, బ్రహ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, వెన్నెల కిశోర్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు కథ, కథనం, మాటలు, దర్శకత్వం అనుదీప్ కె.వి. అభినవ్ రెడ్డి దండా ఎడిటర్. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తరవాత నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న మరో ఫన్‌ఫుల్ మూవీ ఇది.

‘జాతిరత్నాలు’ టీజర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here