ప్రధానాంశాలు:
- పదేళ్ల కిందట చనిపోయిన తల్లి శవం ఫ్రిజ్ భద్రపరిచిన మహిళ.
- పక్కంటి వారికి ఈ విషయాన్ని తెలియకుండా జాగ్రత్తలు.
- అపార్ట్మెంట్ శుభ్రం చేస్తుండగా బయటపడిన నిజం.
‘ఈ మృతదేహం పదేళ్ల కిందట చనిపోయిన నా తల్లిది..అప్పటి నుంచి ఫ్రీజర్‌లోనే భద్రపరిచాను.. ఎందుకంటే తల్లి శవాన్ని ఇంటి నుంచి తీసుకెళ్లడం తనకు ఇష్టం లేదు.. ఆమె నాతోనే ఉండాలనే భావనతో చనిపోయిన తర్వాత భద్రపరిచాను’ అని యోషినో పేర్కొన్నట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. చనిపోయేటప్పటికి ఆమె వయసు 60 ఏళ్లు ఉండగా, మున్సిపల్ హౌసింగ్ కాంప్లెక్స్ అపార్ట్మెంట్ ఆమె లీజుకు తీసుకుంది. తల్లి ఎలా చనిపోయిందో మాత్రం ఆ మహిళ వెల్లడించలేదు.
అద్దె చెల్లించకపోవడంతో యోషినోను జనవరి మధ్యలో బలవంతంగా అపార్ట్మెంట్ ఖాళీ చేయించినట్టు స్థానిక మీడియా తెలిపింది. అపార్ట్‌మెంట్‌ను శుభ్రంచేస్తున్న వ్యక్తి ఫ్రీజర్‌లో ఓ మృతదేహం ఉన్నట్టు గుర్తించాడని పేర్కొంది. ఈ విషయం పోలీసులు, అధికారులకు తెలియజేయడంతో యోషినో కోసం గాలించారు. ఎట్టకేలకు బుధవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దానిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే, ఆమె మరణానికి కారణాలు, సమయం గురించి పోస్ట్‌మార్టం నివేదికలో కచ్చితమైన ఆధారాలు లభించలేదని మీడియా తెలిపింది.