jammu kashmir encounter: పుల్వామా ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం.. సెల్ ఫోన్లో కీలక డేటా – pulwama encounter: 3 terrorists killed in jammu and kashmir’s awantipora

0
20


మ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఎన్‌కౌంటర్ కొనసాగుతోందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. మృతి చెందిన టెర్రరిస్టులను గుర్తించాల్సి ఉందని వెల్లడించారు. పుల్వామా జిల్లాలోని అవంతిపొర పరిధిలోని మండూరలో శుక్రవారం (జనవరి 29) ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.

అవంతిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు చొరబడ్డట్లు గురువారం తమకు సమాచారం అందిందని కశ్మీర్ ఐజీ తెలిపారు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో కశ్మీర్ పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలు పాల్గొన్నాయని తెలిపారు.

ఉగ్రవాదులు మండూర గ్రామంలో ఉన్నట్లు సమాచారం అందుకొని శుక్రవారం ఉదయం నుంచి ఆ గ్రామాన్ని తమ అదుపులోకి తీసుకున్నట్లు కశ్మీర్ ఐజీ తెలిపారు. లొంగిపోవాలంటూ చేసిన హెచ్చరికలను టెర్రరిస్టులు ఖాతరు చేయలేదని చెప్పారు. గాలింపు చేస్తున్న భద్రతా బలగాలపైకి ఉగ్రవాదులు ఓ ఇంట్లో నుంచి గ్రెనేడ్ దాడులు చేసినట్లు వెల్లడించారు. దీంతో భద్రతా బలగాలు ఫైరింగ్ ఓపెన్ చేశారని.. కాల్పుల అనంతరం ఘటనా స్థలంలో ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను గుర్తించామని తెలిపారు.

మృతి చెందిన టెర్రరిస్టుల సెల్ ఫోన్ డేటా విశ్లేషించగా వారికి పాక్ భూభాగం నుంచి ఆదేశాలు వచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఆ ఉగ్రవాదులకు హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరుగుతుండగా ఒక ఉగ్రవాది హిజ్బుల్ టాప్ కమాండర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. ఆ డేటాను విశ్లేషించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here