జమ్మూ కశ్మీర్‌పై హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని స్పష్టం చేశారు. సరైన సమయంలో కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. బిల్లు తేవడమంటే రాష్ట్ర హోదా ఇవ్వబోమని కాదని తెలిపిన అమిత్ షా.. రాష్ట్ర హోదా ఇవ్వబోమని బిల్లులో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీనిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.