jagapathi babu: ‘మ‌హాస‌ముద్రం’లో జ‌గ‌ప‌తిబాబు రఫ్ రోల్.. చుంచు మామగా సీనియర్ హీరో – introducing jagapathi babu as chunchu mama in maha samudram

0
21


శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మ‌హాస‌ముద్రం’. అదితి రావ్ హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ మూవీని ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్రహ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 19న ఈ సినిమా విడుద‌ల కానుంది.

కోల్‌కతాలో ‘శ్యామ్ సింగ రాయ్’.. షూటింగ్ షురూ చేసిన నేచురల్ స్టార్
ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన‌ప్పట్నుంచీ ఇండ‌స్ట్రీ స‌ర్కిల్స్‌లోనూ, ప్రేక్షకుల్లోనూ అమితాస‌క్తి వ్యక్తమ‌వుతూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో సీనియర్ నటుడు జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. నేడు (ఫిబ్రవ‌రి 12న) జగపతిబాబు పుట్టినరోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేస్తూ చిత్ర బృందం ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో జ‌గ‌ప‌తిబాబు ర‌గ్డ్ లుక్‌తో, భిన్నమైన అవ‌తారంలో క‌నిపిస్తున్నారు.
లోప‌ల వ‌ల‌లాగా క‌నిపించే క‌ల‌ర్ బ‌నియ‌న్‌, ఒక గుండీ త‌ప్ప మిగ‌తా గుండీల‌న్నీ విప్పేసి పైకి లాక్కున్నట్లున్న చొక్కా, జీన్స్ ప్యాంట్ ధ‌రించిన జగపతిబాబు తీక్షణంగా చూస్తున్నట్టు ఉన్న లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ‘మ‌హాస‌ముద్రం’ షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతోంది. ఇంటెన్స్ ల‌వ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రాఫ‌ర్‌గా, చైత‌న్ భ‌రద్వాజ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, ప్రవీణ్ కె.ఎల్‌. ఎడిట‌ర్‌గా, కొల్లా అవినాష్ ప్రొడ‌క్షన్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here