‘కే9 డాగ్ టీమ్‌కి పశ్చిమ దేశాల పేర్లను సూచించే సంప్రదాయానికి ముగింపు పలికాం.. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చరిత్రలోనే తొలిసారిగా ఇండో టిబెటన్ బోర్డ్ పోలీస్ (ఐటీబీపీ) శునక యోధులకు స్థానిక పేర్లను సూచించాం.. దేశం కఠినమైన సరిహద్దులకు కాపలాగా ఉన్న అన్ని దళాలకు గౌరవంగా ఈ కుక్కపిల్లల పేరు పెట్టాం’ అని ఐటీబీపీ పేర్కొంది.
‘పంచకుల హరియాణా భాను-ఐటీబీపీ బీటీసీ శునకాల శిక్షణ కేంద్రంలో రెండు నెలల కిందట మగ కుక్కు గాలా- ఆడ కుక్కలు ఓలేషయా, ఓల్గాకు పుట్టిన సంతానానికి నామకరణ మహోత్సవం అధికారికంగా జరిగింది’ అని తెలిపింది. కే9 సైనికులకు 100 శాతం దేశీయ పేర్లను అదికూడా సరిహద్దుల్లో సైన్యం గస్తీ నిర్వహిస్తున్న ప్రాంతాల పేర్లు పెట్టడం ద్వారా స్వాతంత్ర్యం తరువాత తొలిసారి దేశంలోని K9 విభాగం తన స్వంత వారసత్వాన్ని, నీతిని అంగీకరిస్తుంది’ అని తెలిపింది.
తదుపరి బ్యాచ్ శునకాలకు కారాకోరం నుంచి జెచప్ లా వరకు ఐటీబీపీ సైన్యం మోహరించి ఉన్న 3,488 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దుల్లోని మంచు ప్రాంతాల పేర్లను పెట్టాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నామకరణం జరిగిన శునకాలను తమకు అందజేయాలని ఇతర పారామిలటరీ బలగాలు ఐటీబీపీని కోరుతున్నాయి.