it employee tortured: ఇంటర్వ్యూ వేళ క్రూరుడి చేతికి చిక్కిన డీసెంట్ గర్ల్.. చదివితే ఒళ్లు గగుర్పొడుస్తుంది! – it employee tortured by a man, cyberabad dcp anasuya reveals details about most disturbing case

0
26


సంప్రదాయ కుటుంబానికి చెందిన సౌమ్య (పేరు మార్చాం) ఎంతో తెలివైంది. మంచి మార్కులతో బీటెక్ పాసై.. ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరానికి వచ్చింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు డిగ్రీ చదివిన అభి (పేరు మార్చాం) అనే యువకుడు ఆమెను చూశాడు. సౌమ్యతో మాట కలిపి.. రెజ్యుమో నుంచి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ యువతి ఇంటర్వ్యూలో సెలక్ట్ కాగా.. అతడికి జాబ్ రాలేదు.

మాదాపూర్‌లో ఉంటూ ఆఫీసుకెళ్తున్న సౌమ్యకు అతడు ఫోన్ చేశాడు. ఆమె పట్టించుకోకున్నా.. అభి ఫోన్ చేయడం మానలేదు. రోజూ ఫోన్ చేయడంతోపాటు వెంట పడేవాడు. ఐ లవ్యూ చెప్పకపోతే.. చనిపోతానని బెదిరించాడు. భయంతో ఆమె ప్రేమించేందుకు ఒప్పుకుంది.

ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకట్రెండుసార్లు కాఫీ షాపులు, సినిమాలకు వెళ్లారు. ఆ సమయంలో ఆమెతో మామూలుగా దిగిన ఫొటోలను అడ్డం పెట్టుకొని.. వాటిని మీ అమ్మానాన్నకు చూపిస్తానని అభి బెదిరించాడు. అమ్మానాన్నకు విషయం తెలిస్తే ఏమనుకుంటారో అనే భయంతో ఆమె కామ్‌గా ఉండేది. దీంతో సౌమ్య డబ్బులతోనే దుస్తులు, షూ కొనుగోలు చేసేవాడు. తన అవసరాలకు ఆమె డబ్బు వాడుకునేవాడు.

సౌమ్య కంపెనీ మారినా.. అభి అక్కడికి కూడా వెళ్లి హింసించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేశాడు. మీ తల్లిదండ్రులకు ఫోటోలు పంపిస్తానని బెదిరించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండా వీడియోలు తీశాడు.

ఇక అప్పటి నుంచి అతడి వేధింపులు తీవ్రమయ్యాయి. అతడు ఏం చెప్పినా చేయడం మినహా సౌమ్యకు మరో గత్యంతరం లేకపోయింది. ఈలోగా లాక్‌డౌన్ విధించడంతో.. ఇద్దరూ సొంతూళ్లకు వెళ్లిపోయారు. కానీ ఫొటోలు, వీడియోలు పంపి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఆ డబ్బులు కూడా చాలకపోవడంతో.. ట్యూషన్లు చెప్పి డబ్బులు పంపమంటే.. ఆమె అలాగే చేసింది.

డబ్బులిస్తున్నా.. అభి క్రూరత్వం ఆగలేదు. నీతో శారీరక సంబంధం లేదు కాబట్టి.. నీ ప్రయివేట్ పార్ట్‌లను కట్ చేసి.. రక్తం వచ్చేది చూపించు.. కారం పెట్టుకుంటూ చూపించు అని బెదిరించేవాడు. ఆ వీడియోలను సైతం అతడు రికార్డ్ చేశాడు. రోజుకో టాస్క్‌తో
సౌమ్యకు నరకం అంటే ఏంటో చూపించాడు. చివరికి అతడి ఒత్తిడికి తాళలేక.. తన తల్లి దుస్తులు విప్పేస్తున్న వీడియోను సైతం సౌమ్య అతడికి తీసి పంపింది.

సౌమ్య వైఖరిలో వచ్చిన మార్పును గమనించిన సోదరుడు ఏమైందని గట్టిగా నిలదీయగా.. జరిగిందంతా చెప్పి భోరుమంది. అతడు కూడా షాకయ్యాడు. ఇద్దరూ కలిసి చనిపోవాలని భావించారు. సౌమ్య సోదరుడి ప్రవర్తనలో మార్పు వచ్చిన విషయాన్ని అతడి సూపర్ వైజర్ గమనించాడు. ఏమైందని అడగ్గా.. జరిగిందంతా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మానాన్నకు ఈ దారుణం గురించి తెలియొద్దన్నాడు.

సూపర్ వైజర్ సౌమ్య సోదరుణ్ని వెంటబెట్టుకొని సైబరాబాద్ డీసీపీ అనసూయ దగ్గరకు వెళ్లారు. జరిగిందంతా చెప్పారు. ఆ వీడియోలు చూసి డీసీపీ షాకయ్యారు. ఇలాంటి కిరాతకుణ్ని ఇప్పటి వరకూ చూడలేదని ఆమె సీపీకి సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఆ క్రూరుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడి దగ్గరున్న వీడియోలన్నీ డిలీట్ చేశారు. అభిపై కేసు నమోదు చేశారు. అప్పటికీ ఆ అమ్మాయి టెన్షన్ తగ్గలేదు. కానీ అతడు ఇక జీవితంలో నీ జోలికి రాడని పోలీసులు భరోసా ఇచ్చారు. దీంతో తనను చిత్రహింసలకు గురి చేసిన ఆ దుర్మార్గుడికి నాలుగు తగిలించి కసి తీర్చుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here