ప్రధానాంశాలు:
- తుక్కుగా మారుతున్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్.
- విచ్ఛిన్నం పనులు నిలిపివేయాలని సుప్రీం స్టే.
- ప్రస్తుతం పునరుద్ధరణ అసాధ్యమన్న నౌకను కొన్న సంస్థ.
పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, నౌకను కొనుగోలు చేసిన మరో సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే 40 శాతం విచ్ఛిన్న ప్రక్రియ పూర్తయ్యిందని శ్రీరామ్ గ్రూప్ ఛైర్మన్ ముకేశ్ పటేల్ అన్నారు. గతేడాది జులైలో జరిగిన వేలంలో శ్రీరామ్ గ్రూప్ రూ.38.54 కోట్లకు ఐఎన్ఎస్ విరాట్‌ను దక్కించుకుంది. అనంతరం గుజరాత్‌లోని అలంగ్ తీరానికి తరలించి, డిసెంబరు నుంచి తుక్కుగా మార్చే ప్రక్రియను ప్రారంభించింది. నౌక భాగాలను తొలిగించామని, దానిని పునరుద్ధరించడం అసంభవమని తెలిపింది.
‘మొత్తం 40 శాతానికిపైగా విచ్ఛిన్న ప్రక్రియ పూర్తయ్యింది.. మేము ఇప్పటికే ఓడను ఒడ్డుకు తీసుకొచ్చాం.. దానిలోని కొన్ని భాగాలను కూల్చివేశాం.. ఓడ ఇప్పుడు తేలుతూనే ఉండటం అసాధ్యం’ అని శ్రీరామ్ గ్రూప్ ఛైర్మన్ పేర్కొన్నారు. మీడియా ద్వారా సుప్రీంకోర్టు స్టే విషయం గురించి తెలిసినట్టు చెప్పారు. కోర్టు నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదు.. కానీ, ఓడను ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. మాకు నోటీసు అందిన తర్వాత న్యాయ బృందం సమాధానం ఇస్తుంది’ అని అన్నారు.
ఇక, భారత నౌకాదళంలో 29ఏళ్ల పాటు సేవలందించిన ఐఎన్ఎస్ విరాట్ జీవితకాలం పూర్తవడంతో 2017 మార్చిలో దీన్ని ఉపసంహరించారు. విశాఖ తీరంలో ఉన్న ఈ నౌకను తొలుత మ్యూజియంగా మార్చాలని నాటి ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తుక్కుగా మార్చి విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో వేలం నిర్వహించగా.. శ్రీరాం షిప్ బ్రేకర్స్ సంస్థ రూ.38.54 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఈ నౌకను గుజరాత్‌లోని అలంగ్ తీరానికి తరలించి, కొంతభాగాన్ని నిర్వీర్యం చేశారు. అయితే ఈ యుద్ధనౌకను మ్యూజియంగా మార్చాలని భావిస్తున్న ఎన్విటెక్ అనే మరో సంస్థ నౌకను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. కానీ రక్షణశాఖ నుంచి నిరభ్యంతర పత్రం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది.