సరిహద్దుల్లో సుదీర్ఘంగా కొనసాగుతున్న మోహరింపుతోపాటు జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు సైనికుల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సైనికులు ఇంటి వద్ద తమ కుటుంబాలు ఎదుర్కొనే సమస్యల విషయంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. ఆస్తి వివాదాలు, సామాజిక వ్యతిరేక అంశాలపై వేధింపులు నుంచి ఆర్ధిక, వైవాహిక సమస్యలు వరకు వారిని వేధిస్తుంటాయి.
ఘర్షణపూరిత వాతావరణంలో ఇండియన్ ఆర్మీ జవాన్లు సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించడం వారిలో ఒత్తిడికి ప్రధాన కారణమని అధ్యయనం పేర్కొంది. ‘కార్యాచరణ ఒత్తిళ్లు’ బాగా అర్థం చేసుకుని, వృత్తికి సమగ్రంగా అంగీకరించినా నాన్-ఆపరేషనల్ ఒత్తిడులు సైనికుల ఆరోగ్యం, పోరాట సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాలను పెంచుతున్నాయి.. తద్వారా వారి యూనిట్లను కూడా ప్రభావితం చేస్తుంది’ అని వ్యాఖ్యానించింది.
‘జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు (జేసీఓలు), జవాన్లు ఎదుర్కొంటున్న దానికంటే ఎక్కువ ఒత్తిడిని అధికారులు అనుభవిస్తారు. దీనికి ప్రభుత్వ అత్యున్నత స్థాయిల నుంచి అత్యవసర జోక్యం అవసరం’ అని సూచించింది.