ఆ తర్వాత బస్సు నెమ్మదిగా వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక అక్కడ నుంచి ఆ వీడియోను వీక్షించే వారిలో ఉత్కంఠ పెరిగిపోతుంది. పెద్ద కొండ, భారీ లోయ మధ్య ఇరుకైన రోడ్డు.. ఆ రోడ్డుపై బస్సు.. ఏమాత్రం తేడా వచ్చినా.. ఆనవాళ్లు కూడా దొరకవు. అలాంటి రోడ్డు మీద బస్సు వెనక్కి కదులుతూ.. కొండ అంచు వరకూ వచ్చే సరికి ఆ వీడియో చూస్తున్నవారికి గుండె ఆగినంత పని అవుతుంది.
డ్రైవర్ అద్భుతం చేశాడు. పూర్తి నియంత్రణతో, ఎంతో నైపుణ్యంతో బస్సును నెమ్మది నెమ్మదిగా ముందుకు, వెనక్కి పోనిస్తూ.. రివర్స్ చేశాడు. ‘అలాంటి రోడ్డు మీద బస్సు డైరెక్షన్‌ను ఎలా మార్చాడు.. ఇది నమ్మశక్యంగా లేదే..’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బస్సు డ్రైవర్ టాలెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లోని కీలాంగ్-కిల్లర్ రహదారిపై చోటు చేసుకున్న ఈ ఘటనను స్థానికుడొకరు తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను జులై 18న యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేశారు. ఓంకార్ మాలుస్తే పేరుతో గల యూట్యూబ్ ఛానెల్లో పోస్టు చేసిన ఆ వీడియో అప్పట్లో వైరల్ అయింది. ముందుకు వెళ్లాల్సిన దారి మూసుకుపోవడంతో బస్సు డ్రైవర్ వాహనాన్ని వెనక్కి తిప్పాడని దాని క్యాప్షన్‌లో రాశారు. తాజాగా ఆ వీడియోను ఇన్క్రెడిబుల్ హిమాచల్ ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. దీంతో మరోసారి వైరల్‌గా మారింది.
డిసెంబర్ 16న ఫేస్బుక్లో పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు. బస్సు డ్రైవర్ నైపుణ్యానికి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎంతో ధైర్యంతో కూడుకున్న ఆ బస్సు డ్రైవర్ సాహసాన్ని మీరూ చూసేయండి.. మీ అభిప్రాయం కామెంట్లలో రాయండి.
Don’t Miss:
✧పబ్లిక్ టాయిలెట్లో లేడీ పోలీస్ ఫోన్ నంబర్.. ఆరా తీస్తే షాక్!
✧మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్‌కు అలర్జీ, తిమ్మిర్లు..