అంత డబ్బు ఇచ్చేందుకు ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో హిజ్రాలు అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఇంటి యజమాని, హిజ్రాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంటి యజమాని నుంచి 16,500 రూపాలయను బలవంతంగా వసూలు చేసి తీసుకెళ్లారు.
డబ్బులు పోయాయి, పరువు పోయింది. ఇది ఆ ఇంటి యజమానిని కలచివేసింది. నేరుగా వెళ్లి బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. 10 మంది హిజ్రాలను అరెస్టు చేశారు. వారి నుంచి 7 సెల్ఫోన్లు, రూ.16,500 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇచ్చింది తీసుకొని వెళ్లిపోతే సరిపోయేదానికి ఆ హిజ్రాలు చివరికి ఇంత దాకా తెచ్చుకున్నారు. ఇలా వేధింపులకు గురిచేసే వాళ్లు చాలా మంది ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. బస్టాపులు, రోడ్లు, రైళ్లు అని తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారిని ఇక ఎంతమాత్రం ఉపేక్షించేది లేదంటున్నారు. హిజ్రాల బాధితుల్లో ఈ ఘటన ధైర్యం నింపినట్లు కనిపిస్తోంది.