ప్రధానాంశాలు:
- దేశంలో 15 ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్లు.
- 9 అత్యాధునిక (BSL-3) ప్రయోగశాలలు.
- 4 ప్రాంతీయ వైరల్ కేంద్రాలు.
4 ప్రాంతీయ వైరల్ ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వైరల్ వ్యాధుల నిర్ధరణలో ప్రస్తుతం పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. బర్డ్ ఫ్లూ, కరోనా వైరస్ సహా పలు కొత్త రకాల వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ కేంద్రంపై ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాలను సమతూకం చేస్తూ మరో 4 కేంద్రాలను ఏర్పాటు చేయడం ప్రయోజనకరంగా మారనుంది. పుణే సంస్థపై భారం తగ్గనుంది.
ఆరోగ్య రంగంలో రూ.64180 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దీన్ని ‘ఆత్మ నిర్భర భారత్ ఆరోగ్య పథకం’గా పేర్కొన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ కోసం రూ.35 కోట్ల కేటాయించినట్లు వెల్లడించారు.