ప్రధానాంశాలు:
- అంథాలజీ కాన్సెప్ట్‌తో ‘హాఫ్ స్టోరీస్’
- మారుతి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్
- ఆసక్తిరేకెత్తిస్తున్న వీడియో
బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివ వరప్రసాద్ కె. దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం “హాఫ్ స్టోరీస్”. రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందుమౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ని ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బేబీ లాలిత్య, నిర్మాత సుధాకర్ రెడ్డి, దర్శకుడు శివ వరప్రసాద్ కె., హీరో రాజీవ్ పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ.. ”హాఫ్ స్టోరీస్ చిత్ర గ్లింప్స్ చూశాను. చాలా బాగా నచ్చింది. అంథాలజీ బేస్డ్ కాన్సెప్ట్ ఇది. అంథాలజీ కాన్సెప్ట్ అంటేనే మంచి హిట్ కాన్సెప్ట్. ఆ జానర్లో వచ్చే సినిమాలన్నీ చాలా బాగుంటాయి. ఒకే టోన్‌లో ఐదు రకాల కథలు చెప్పడం సామాన్యమైన విషయం కాదు. ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేసిన నిర్మాత సుధాకర్ రెడ్డిగారిని ముందుగా అభినందిస్తున్నాను. డైరెక్టర్ శివ ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడనేది ఈ వీడియో చూస్తుంటే తెలుస్తుంది. ఇందులో హీరో రాజీవ్ పాత్ర సినిమాకి ప్లస్ అవుతుంది.
ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు యాక్ట్ చేశారు. ఆయన పాత్ర ఈ సినిమాకి ఎస్సెట్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి, పెద్ద సక్సెస్ చేసి మళ్లీ ఇలాంటి మంచి మంచి సినిమాలు వీరి నుంచి వచ్చేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్” అన్నారు.