Greta Thunberg Toolkit Case: గ్రేటా టూల్‌కిట్ వ్యవహారంలో కీలక మలుపు.. బెంగళూరు యువతి అరెస్ట్ – delhi police arrest bengaluru climate activist in greta toolkit probe

0
20


స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ రైతుల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ టూల్‌కిట్ షేర్ చేసిన వ్యవహారంపై పోలీస్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల యువతిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సోలదేవనహల్లికి చెందిన దిశ రవి అనే పర్యావరణ కార్యకర్తను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఫ్రైడే‌స్ ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకురాలైన యువతిని తన నివాసంలోనే అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

గ్రెటా షేర్ చేసిన టూల్‌కిట్ దిశ ఎడిట్ చేసి తిరిగి పోస్ట్ చేసినట్టు అంగీకరించినట్టు స్పెషల్ సెల్ పోలీసులు పేర్కొన్నారు. మౌంట్ కార్మెల్ మహిళా కాలేజీలో చదువుతోన్న యువతి.. గ్రెటా థన్‌బర్గ్ పర్యావరణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత 2018 ఆగస్టు నుంచి దిశ రవి కూడా భారత్‌లో ఉద్యమాలు చేస్తోంది. అందులో భాగంగానే ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు పలువురు అంతర్జాతీయ ప్రముఖులు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. సెలబ్రిటీలు చేసిన ట్వీట్లపై భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ట్వీట్ల ద్వారా నేరపూరిత కుట్ర, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రోత్సహిస్తున్నారంటూ ఢిల్లీ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

‘ఆందోళన చేస్తున్న భారతీయ రైతులకు సంఘీభావం తెలుపుతున్నాం.. తాము అండగా ఉంటాం’అని గ్రెటా థన్‌బర్గ్ ట్వీట్ చేస్తూ.. సీఎన్ఎన్ రాసిన కథనాన్ని పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా రైతుల ఉద్యమానికి మద్దతు ఎలా తెలియజేయాలో పేర్కొంటూ ‘టూల్‌కిట్’ పేరుతో ఓ ట్వీట్ చేశారు. తనపై పోలీసులు కేసు నమోదుచేయడంపై ఆమె స్పందిస్తూ.. తాను మాత్రం బెదిరింపులకు తలొగ్గబోనని చెప్పారు. రైతులకు మద్దతు కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు. విద్వేషం, బెదిరింపులు తన వైఖరిని ఎన్నటికీ మార్చలేవని ఉద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here