ప్రధానాంశాలు:
- మారుతి దర్శకత్వంలో గోపీచంద్ సినిమా
- యూవీ క్రియేషన్స్, జీఏ2 సంయుక్త నిర్మాణం
- టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటించకుండానే రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ ఏడాది అక్టోబర్ 1న గోపీచంద్-మారుతి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. అంతేకాదు, ఆసక్తికర సందేశంతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్లో థియేటర్ సీట్లో అక్టోబర్ 1న విడుదల అని ఇంగ్లిష్‌లో రాసి.. కచ్చీఫ్ వేస్తున్నట్టు చూపించారు. ప్రస్తుతం ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువీ, జీఏ2 వినూత్న ప్రయత్నానికి మంచి స్పందన వస్తోంది.
‘‘అందరికీ చాలా థాంక్సండీ..!
రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఏదో కొత్తగా ట్రై చేద్దామని మేము చేసిన ప్రయత్నాన్ని యాక్సప్ట్ చేసి, మంచి బూస్టప్ ఇచ్చిన ఇండస్ట్రీ, మీడియా మరియు ప్రేక్షక దేవుళ్ళందరికీ చాలా థాంక్సండీ. మా ఈ చిత్రం అల్లు అరవింద్ సమర్పణలో హీరో గోపీచంద్ మరియు దర్శకుడు మారుతిల కాంబినేషన్లో త్వరలో షూటింగ్ మొదలుపెట్టి.. చెప్పిన టైమ్‌కి రిలీజ్ చేయగలమని హామీ ఇస్తున్నాం. ఇలాగే మేము చేసే ప్రతి ప్రయత్నం మీకు నచ్చి మీరు మెచ్చి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం.
మీ.. యూవీ క్రియేషన్స్ మరియు జిఎ2 సంస్థలు’’ అని తమ సందేశంలో పేర్కొన్నారు నిర్మాతలు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు.