‘జమ్మూకశ్మీర్‌లో ఇటీవల ఎన్నికలు నిర్వహించిన తీరును ఆజాద్ ప్రశంసించారు. మీ పార్టీ (కాంగ్రెస్) కూడా దాన్ని అదే స్పిరిట్‌తో తీసుకుంటుందని ఆశిస్తున్నా. ముఖ్యంగా జీ-23 సలహాను వ్యతిరేకించి మీ పార్టీ మరో తప్పు చేయదని భావిస్తున్నా’ అని మోదీ అన్నారు.
ఏమిటీ జీ-23 సలహా..?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కొందరు గతేడాది ఆగస్టులో పార్టీ అధినాయకత్వంపై లేఖాస్త్రం సంధించిన విషయం తెలిసిందే. వరుస ఓటముల నేపథ్యంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని, సమర్థులై వారికి పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని వారు కోరారు. పలు సూచనలు చేశారు. మొత్తం 23 మంది నేతలు ఈ లేఖ ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వీరిలో గులాంనబీ అజాద్ పాత్ర కీలకమైంది.
అయితే.. సీనియర్ నేతలు లేఖ రాయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఇది పార్టీలో తీవ్ర కలకలం రేపింది. పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీపై తిరుగుబాటు లేఖగా కొంత మంది నేతలు దీన్ని అభివర్ణించారు. గులాంనబీ అజాద్, కపిల్ సిబల్ సహా పలువురి నేతలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ లేఖపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా స్పందించారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీ సమావేశంలో హెచ్చరించారు.