Gehana Vasisth Arrest: పోర్న్ రాకెట్: నటి వెబ్‌సైట్‌లో వీడియోలు.. ‘ఆపరేషన్ దుర్యోధన’ ఐటమ్ గర్ల్ అరెస్ట్ – actress and model gehana vasisth held for shooting and uploading porn videos on her website

0
26


ప్రధానాంశాలు:

  • మిస్ ఆసియా బికినీ విజేత గెహన వశిష్ట్
  • ‘ఆపరేషన్ దుర్యోధన’తో టాలీవుడ్‌కు పరిచయం
  • తెలుగు నటుడు శ్రీధర్ రావుకు ఆమె స్నేహితురాలు

నటి, మోడల్ గెహన వశిష్ట్‌ను ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోర్న్ వీడియోలను షూట్ చేయడం, వాటిని ఆమె వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం వెనుక గెహన వశిష్ట్ ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఆదివారం కోర్టులో హాజరుపరిచారు. గెహనతో పాటు మరికొంత మంది మోడల్స్, చిన్న చిన్న నటీమణులు, కొన్ని నిర్మాణ సంస్థల ప్రమేయం ఈ పోర్న్ వీడియో రాకెట్‌లో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పోర్న్ వీడియోలను మొబైల్ యాప్స్, వెబ్‌సైట్‌లలో మరికొందరు అప్‌లోడ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.

మాల్దీవుల్లో RRR బ్యూటి.. బికినీ అందాల్లో పిచ్చెక్కిస్తోన్న స్టార్ హీరోయిన్
గెహన మిస్ ఆసియా బికినీ విజేత. ఈమె పలు వాణిజ్య ప్రకటనలు, హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది. శ్రీకాంత్, పోసాని కృష్ణమురళి కాంబినేషన్‌లో వచ్చిన హిట్ మూవీ ‘ఆపరేషన్ దుర్యోధన’లో గెహన వశిష్ట్ ఐటమ్ సాంగ్ చేసింది. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తరవాత ‘ఆపరేషన్ దుర్యోధన 2’, ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నమస్తే’, ‘33 ప్రేమకథలు’, ‘బీటెక్ లవ్‌స్టోరీ’ వంటి చిన్న చిన్న సినిమాల్లో నటించింది. తెలుగు నటుడు శ్రీథర్ రావు తనకు స్నేహితుడని ఆయనతో తీసుకున్న సెల్ఫీని ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గెహన షేర్ చేసింది.

ఇదిలా ఉంటే, పోర్న్ వీడియోల్లో గెహన ప్రమేయం గురించి ఓ సీనియర్ పోలీస్ అధికారి ముంబై మిర్రర్‌కు తెలియజేశారు. ‘‘ఆమెన 87 పోర్న్ వీడియోలను షూట్ చేసి వాటిని తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. వాటిని చూడాలంటే సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలి. సబ్‌స్ర్కైబ్ చేసుకునేవాళ్లు రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది’’ అని పోలీస్ అధికారి తెలిపారు. పోర్న్ సినిమాల్లో తమను బలవంతంగా నటింపజేస్తున్నారని ముగ్గురు బాధితులు తమను ఆశ్రయించడంతో ఈ రాకెట్ బయటపడిందని వెల్లడించారు.
మలాద్‌లోని మధ్ ఐల్యాండ్‌లో ఉన్న గ్రీన్ పార్క్ బంగ్లాలో గురువారం పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్కడ యాస్మిన్ బేగ్ ఖాన్ అలియాస్ రోవ, ప్రతిభ నలవాడే, మోను గోపాల్‌దాస్ జోషి, భానుసూర్యం ఠాకూర్, మహమ్మద్ ఆసిఫ్ అలియాస్ సైఫీలను అరెస్ట్ చేశారు. ఒక బాధితురాలిని రక్షించి రెహబిలిటేషన్ సెంటర్‌కు పంపారు. మూడు బ్యాంక్ అకౌంట్లను పోలీసులు సీజ్ చేశారు. సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వసూలైన రూ.36 లక్షలు ఈ బ్యాంక్ అకౌంట్లలో జమ అయినట్టు పోలీసులు గుర్తించారు.

బ్లాక్ బస్టర్ ‘జాంబి రెడ్డి’.. రెండో రోజుల్లో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే!
ఈ పోర్న్ వీడియోలకు యాస్మిన్ దర్శక నిర్మాత, సైఫీ కెమెరామెన్, ప్రతిభ గ్రాఫిక్ డిజైనర్ అని పోలీసులు తెలిపారు. జోషి నటించందని.. ఠాకూర్ అసిస్టెంట్ అని వెల్లడించారు. వీరి వద్ద నుంచి ఒక హెచ్‌డీ వీడియో కెమెరా, ఆరు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, స్పాట్‌లైట్, కెమెరా స్టాండ్, వీడియో క్లిప్స్‌తో కూడిన మెమొరీ కార్డ్ స్వాధీనం చేసుకున్నట్టు మలాద్ డీసీపీ ప్రకాష్ జాదవ్ చెప్పారు. సినిమాల్లో అవకాశాల ఇప్పిస్తామని కొత్త అమ్మాయిలను తీసుకొని వారిని గ్రీన్ పార్క్ బంగ్లాకు తీసుకెళ్లి పోర్న్ వీడియోల్లో నటించాలని ఒక గ్యాంగ్ బలవంతం చేస్తుందని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here