Gaali Sampath First Song: వాళ్లిద్దరూ గిఫ్టెడ్ యాక్టర్స్.. కలిసొస్తున్నారు: నాని – natural star nani released the first lyrical video song from gaali sampath

0
20


ప్రధానాంశాలు:

  • రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు తండ్రీకొడుకులుగా ‘గాలి సంపత్’
  • అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న చిత్రం
  • పాటను విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, యువ నటుడు శ్రీవిష్ణులను గిఫ్టెడ్ యాక్టర్స్‌గా అభివర్ణించారు నేచురల్ స్టార్ నాని. వీరిద్దరూ ప్రధాన పాత్రలు పోషించిన ‘గాలి సంపత్’ సినిమాలోని తొలి పాటను నాని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ‘ఫిఫిఫీ ఫిఫీఫీ’ అంటూ సాగే ఈ పాట చాలా బాగుంది. వినడానికి ఎంత బాగుందో చూడటానికి కూడా అంతే అందంగా ఉంది ఈ పాట. అందుకే, ఈ పాటను విడుదల చేయడం తనకు చాలా ఆనందంగా ఉందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు నాని.
ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి స‌మ‌ర్పణ‌లో రూపొందుతోన్న చిత్రం ‘గాలి సంప‌త్’. అనిల్ ఈ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్ ప్లే అందించారు.. ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ చేస్తున్నారు. అనిల్ దగ్గర కో-డైరెక్టర్‌గా, రచయితగా పనిచేసిన తన మిత్రుడు ఎస్. క్రిష్ణ ఈ చిత్రానికి నిర్మాత. ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్‌టైన్మెంట్ అనే బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కథ కూడా క్రిష్ణే అందించారు.

పెళ్లిరోజు భర్తకు లాస్య సర్‌ప్రైజ్.. భార్య గిఫ్ట్ చూసి షాకైన మంజునాథ్.. ఇక లాంగ్ డ్రైవ్‌లే!
‘గాలి సంపత్’గా రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, లవ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లు. అనీష్ ద‌ర్శక‌త్వం వ‌హించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం మ‌హా శివ‌రాత్రి కానుక‌గా మార్చి11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచారంలో భాగంగా ఈ సినిమా నుంచి తొలిపాట ‘ఫిఫిఫీ ఫిఫీఫీ’ని నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల‌చేశారు.

‘రాజా రాజశ్రీ గాలి సంప‌త్‌ గారు మైడియ‌ర్ డాడీ బాబండీ.. మా బాబుగారు చేసే డైలీ విన్యాసాలు ఊహాతీతం సుమండీ’.. అంటూ సాగే ఈ పాట‌కి రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించ‌గా అచ్చు రాజ‌మ‌ణి మంచి స్వరాలు స‌మ‌కూర్చారు. రాహుల్ నంబియార్‌, శ్రీకృష్ణ విష్ణుబొట్ల క‌లిసి పాడిన ఈ పాటకు రాజేంద్ర ప్రసాద్ గొంతు కూడా కలిపారు. అలాగే, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మరో ప్రత్యేక ఆకర్షణ. రాజేంద్ర ప్రసాద్‌కు సరిగ్గా సరిపోయేలా స్టెప్పులు కంపోజ్ చేశారు శేఖర్. మొత్తంగా ఈ పాట వెండితెరపై ఒక మంచి ఫీస్ట్ అవుతుంది.

‘ఉప్పెన’ కలెక్షన్స్: నాలుగో రోజు తగ్గిన వసూళ్లు.. రూ.33 కోట్లు దాటిన షేర్!
కాగా, ఈ సినిమాలో ఇంకా త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మీమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి ముఖ్య పాత్రల్లో నటించారు. అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆదినారాయణ రచనా సహకారం అందించారు. ఎస్.ఎస్. ప్రకాశ్ ఆర్ట్ డైరెక్టర్. తమ్మిరాజు ఎడిటర్. మిర్చి కిరణ్ మాటలు రాశారు.

‘గాలి సంపత్’ సాంగ్.. ఫిఫిఫీ ఫిఫీఫీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here