female doctors harassment: ఈ-కన్సల్టేషన్ పేరుతో మహిళా డాక్టర్లపై లైంగిక వేధింపులు.. దాచిపెడుతున్న వెబ్‌సైట్లు – women doctors sexually harassed during e-consultations, websites try to hide it

0
43


వైద్యులతో 24 గంటల కన్సల్టేషన్ నిర్వహించే వెబ్‌సైట్లు మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు కేంద్రాలుగా మారిపోయాయి. వైద్యుల సాయం కోరే ముసుగులో పలువురు హస్త ప్రయోగం చేయడం, అసభ్యకరమైన సంభాషణలు సాగించడం వంటివి చేస్తున్నట్టు వెల్లడయ్యింది. ఇలాంటి సంఘటనలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోడానికి బదులు.. వెబ్‌సైట్లు వాటిని తనిఖీ చేయడానికి కొన్ని చర్యలు తీసుకుని, ఈ విషయం బయటకు రాకుండా ప్రయత్నిస్తున్నాయి.

టెలిమెడిసిన్ సలహాలపై ఈ ఏడాది మేలో నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం.. రోగి, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్ఎంపీ) ఇద్దరూ గుర్తింపును తెలుసుకోవాలి.. దీన్ని చాలా వెబ్‌సైట్లు అనుసరించడం లేదు.. వాస్తవానికి, సెకెన్లు లేదా నిమిషాల్లో చాలా మంది పేర్లు నమోదు చేసి, సంప్రదింపుల కోసం వైద్యుని వద్దకు పంపవచ్చు.

రోగులు వేర్వేరు ఐడి నంబర్లతో పేర్లు నమోదు చేసుకుని మహిళా వైద్యులను వేధించడానికి వాటిని ఉపయోగిస్తారు. కొందరు ఆడపిల్లలుగా నమోదు చేసుకుని వేధిస్తారు. వారితో మాట్లాడిన తర్వాతే వైద్యులు దీనిని గ్రహిస్తారు. ఒక వైద్యుడిని వేధించిన తర్వాత అలాంటి కాల్ చేసేవారిని గుర్తించడానికి, నిరోధించడానికి లేదా లైంగిక వేధింపుల గురించి అధికారిక ఫిర్యాదులను ఇవ్వడానికి సైట్లు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని అలుసుగా తీసుకుంటున్నారు.

యాప్‌లో ఎంచుకున్న సేవలను బట్టి ప్లాన్‌లు అందజేస్తాయి. చాలా వెబ్‌సైట్లు అన్‌లిమిటెడ్ ఫ్రీ కన్సల్టేషన్ లేదా రోజుకు పరిమిత సంఖ్యలో ఉచిత కన్సల్టేషన్ అందుబాటులో ఉంచుతున్నాయి.

‘ఇది చాలా బాధాకరమైంది.. ముఖ్యంగా ఇది జరిగిన మొదటిసారి. ఈ కాల్స్ రాత్రిపూట జరుగుతాయి కాబట్టి ఇప్పుడు రాత్రిపూట ఎక్కువగా పురుష వైద్యులను నియమించాలని కంపెనీని అభ్యర్థించాం.. నెలవారీ సభ్యత్వం కోసం అన్‌లిమిటెడ్ కాల్‌లను అనుమతించడాన్ని కూడా నిలిపివేశారు. ఇది మేము ఎదుర్కొంటున్న కాల్స్ సంఖ్యను తగ్గించింది’ ఓ సీనియర్ వైద్యుడు చెప్పారు.

దేశంలో తొలిసారి టెలీకన్సల్టేషన్ సేవలను ప్రారంభించిన ప్రాక్టో, ఇండియా బుల్స్, ధని వంటి వెబ్‌సైట్స్‌లో పనిచేసే వైద్యులు రోజూ రోగుల నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. టెలీకన్సల్టేషన్ సేవలను ఉపయోగించాలనుకునే రోగులకు గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేస్తామని వైద్యులకు హామీ ఇచ్చినప్పటికీ, అప్‌లోడ్ సమయంలో వాటిపై ఎటువంటి పరిశీలన లేదని తెలుస్తోంది.. వెబ్‌సైట్‌లో ఈ నిబంధనలు కనిపించవు.

ఇది మా ఉద్యోగంలో భాగంగా సాధారణీకరించదు. మేము ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉన్నాం.. ఒక వ్యక్తి నిజమైన రోగి కానప్పుడు కాల్‌ను వెంటనే ముగించి వ్యక్తిని బ్లాక్ చేసి కంపెనీకి తెలియజేయవచ్చు.. కానీ మేము దీనిని సహించాల్సిన అవసరం లేదు. ప్రిస్క్రిప్షన్‌లో కాల్ కోసం మాకు ఎటువంటి కమీషన్ కూడా చెల్లించరు’అని ధని కోసం పనిచేస్తున్న ఒక వైద్యుడు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here